త్రివిక్రమ్ చాలా తెలివైనోడు అని ఆయన సినిమాలు చూసిన ప్రతీ ఒక్కరూ ఒప్పుకుంటారు. అంతేకాదు ఆయన కెరీర్ విషయంలోనూ ఆచి,తూచి అడుగులు వేస్తారు. పెద్ద హీరోలతోనే చేయాలని సంవత్సరాల తరబడి వెయిట్ చెయ్యరు. గ్యాప్ నితిన్ లాంటి హీరోలతో అ...ఆ లాంటి సినిమాలు లాగించేస్తారు. ఇప్పుడు కూడా అలాంటి స్కీమ్ మరొకటి త్రివిక్రమ్ వేసాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో అనుకున్న  సినిమామ ప్లాన్..కరోనా దెబ్బ తో  అడ్డంగా బెడిసికొడితే ఏం చేయాలి అనే ప్లాన్ బి ఆయన దగ్గర ఉందిట. 
 
 వివరాల్లోకి వెళితే... త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ తో కల్యాణ్ రామ్ -  చినబాబు కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే  త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసి,ఎన్టీఆర్ డిస్కస్ చేస్తూ ఫైనల్ చేసే పనిలో వున్నాడు. అయితే లాక్ డౌన్ అయిన వెంటనే త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి లేదు. 

ఎందుకంటే రాజమౌళితో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' షూటింగు ఇంకా బాలెన్స్ వుంది. ఆ సినిమా షూటింగు పూర్తయ్యేవరకూ ఎన్టీఆర్ తన లుక్ ను కంటిన్యూ చేయవలసే ఉంటుంది. మరి త్రివిక్రమ్ అంతదాకా ఖాళీగా కూర్చోవాలా. నెవ్వర్ ..అలాంటి పని ఎప్పుడూ ఆయన చేయరు. మరీ గ్యాప్ ఎక్కువ అవుతుందనుకుంటే..వెంటనే మరో ప్రాజెక్టుతో రంగంలోకి దూకటానికి సిద్దంగా ఉన్నారట. 

'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ పోర్షన్ కి సంబంధించిన షూటింగు ఎప్పుడు పూర్తవుతుందనే విషయంపై   క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారట. అది రాగానే ఎన్టీఆర్ తో వెళ్లటానికి టైమ్ పడితే.. ఈ లోగా ఓ మాదిరి బడ్జెట్ లో 'అ ఆ' వంటి సినిమా ఒకటి చేయాలని  త్రివిక్రమ్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్నాడని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన హీరోలుగా నాని .. చైతూ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా రాజమౌళి ఏమంటారు అన్నదానిపై ఆధారపడి ఉంటుందిట.