Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి గ్రీన్ సిగ్నల్ కోసం..త్రివిక్రమ్,కొరటాల వెయిటింగ్

 కరోనా దెబ్బతో పెద్దా,చిన్నా అనే తేడా లేకుండా అన్ని షూటింగ్ లు వాయిదా పడ్డాయి. రాజమౌళి తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆపేసి ఎప్పుడు పరిస్దితులు సక్రమ స్దితికి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ ప్రభావం ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్,కొరటాల శివపై పడిందని సమాచారం.

Trivikram,koratla waiting period gets extended
Author
Hyderabad, First Published Apr 4, 2020, 6:57 AM IST


సినిమా పరిశ్రమ ఓ పెద్ద చెయిన్ లింక్. ఒక చోట మొదలయ్యే చిన్న కదిలక వేరే చోట భారీగా తన  ప్రభావం చూపెడుతుంది. లేకపోతే కొరటాల, త్రివిక్రమ్ వంటి స్టార్ డైరక్టర్స్ మరో స్టార్ డైరక్టర్ రాజమౌళి నిర్ణయాలు కోసం ఎదురుచూడటం ఏమిటి.  సినిమా ప్రారంభించాలంటే మొదట కావాల్సింది హీరోల డేట్స్. దాన్ని బట్టి మిగతా ప్లానింగ్ అంతా ఉంటుంది. అయితే స్టార్ హీరోల డేట్స్ కూడా తాము ఆల్రెడీ చేస్తున్న సినిమా షూటింగ్ ల షెడ్యూల్ పై ఆధారపడి ఉంటుంది. కరోనా దెబ్బతో పెద్దా,చిన్నా అనే తేడా లేకుండా అన్ని షూటింగ్ లు వాయిదా పడ్డాయి. రాజమౌళి తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆపేసి ఎప్పుడు పరిస్దితులు సక్రమ స్దితికి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ ప్రభావం ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్,కొరటాల శివపై పడిందని సమాచారం.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్. వీరిద్దరూ తమ తదుపరి సినిమాలు ఆల్రెడీ సైన్ చేసేసారు. రామ్ చరణ్ అయితే కొరటాల దర్శకత్వంలో తన తండ్రి నటిస్తున్న ఆచార్యలో ఓ కీ రోల్ లో  కనిపించనున్నారు. ఎన్టీఆర్ కూడా తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయటానికి రంగం సిద్దం చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు ఫ్రీ కావాలంటే ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ లో తమ పార్ట్ పూర్తి చేసుకుని బయిటకు రావాలి. అప్పుడు కానీ వేరే సినిమా మొదలెట్టలేరు. దాంతో కొరటాల శివ, త్రివిక్రమ్ ఇద్దరు కూడా ఆర్ ఆర్ ఆర్ వైపే చూస్తున్నారు.

కొరటాల శివ అయితే ఈ లోగా చిరంజీవి తో షూటింగ్ ఫినిష్ చేసుకునే అవకాసం ఉంది. కానీ త్రివిక్రమ్ కు ఆ పరిస్దితి లేదు. అలవైకుంఠపురములో తర్వాత ఆయనకు గ్యాప్ వచ్చేస్తుంది. జూన్ నుంచి ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభిద్దామనుకున్నారు. ఇప్పుడు మరో నాలుగు నెలలు పైగా వెయిట్ చెయ్యాల్సిన పరిస్దితి. 

Follow Us:
Download App:
  • android
  • ios