లాక్ డౌన్ టైమ్ లో స్టార్స్ తమ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటున్నారు. ఈ టైమ్ లో ఇంటికే పరిమితమైన  త్రిష... చాలా రోజుల తర్వాత ఇనిస్ట్రాలో ఫ్యాన్స్ తో మాట్లాడింది.. చాలా విషయాల్ని షేర్ చేసుకుంది. త్రిష క్వారంటైన్ చిట్ చాట్ లో తనకు ఇష్టమైన ముగ్గురు హీరోల గురించి చెప్పుకొచ్చింది. అయితే ఆమె చెప్పిన లిస్ట్ లో తెలుగు హీరోలెవరూ లేకపోవటం విశేషం. ఆమె చెప్పిన..ఇండియాలో ఇష్టమైన ముగ్గురు నటులు..కమల్ హాసన్, మోహన్ లాల్, అమీర్ ఖాన్. తెలుగు నుంచి ఏ హీరో పేరైనా చెప్తుందేమో అని ఎక్సపెక్ట్ చేసిన అభిమానులకు ఆమె తీవ్ర నిరాశను కలిగించింది.

ఇక తన ఆల్ టైమ్  ఫేవరెట్ సిరీస్ గా "సెక్స్ అండ్ ది సిటీ"ని చెప్పుకొచ్చింది త్రిష. టాలీవుడ్‌లో అంతంత‌మాత్రం అవ‌కాశాలు ఉన్న ఈ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో రీఎంట్రీ ఇస్తుంద‌ని అంతా భావించారు. కానీ ఆ సినిమా నుంచి వైదొల‌గిన‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్‌కు గురి చేసిన విష‌యం తెలిసిందే. కాగా రానా, త్రిష డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఎన్నో వార్తలు వెలువ‌డ్డాయి. దీనిపై ఓ కార్య‌క్ర‌మంలో స్పందించిన రానా ఆమెతో ఉన్న‌ అనుబంధం గురించి మాట్లాడుతూ.. త్రిష త‌న‌కు ద‌శాబ్ద కాలంగా మిత్రురాల‌ని పేర్కొన్నాడు. 

 స్వీయ నిర్భంధంలో ఉన్న నా  ఇద్ద‌రు  ఫ్రెండ్స్ రానా ద‌గ్గుబాటి, అల్లు అర్జున్‌ మంచి కంపెనీ ఇచ్చార‌ని చెప్పుకొచ్చింది.ఇటీవల విజయ్‌ సేతుపతితో రొమాన్స్‌ చేసిన 96, రజనీకాంత్‌తో జత కట్టిన పేట చిత్రాల విజయాలు మరింత నూతనోత్సాహాన్నిచ్చాయి. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తయారు చేసిన కథతో శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో పాటు మరో కొత్త చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న ఈ బ్యూటీ అంతకుముందు నటించిన చతురంగవేట్టై, తను సెంట్రిక్‌ పాత్రలో నటించిన పరమపదం విళైయాట్టు, గర్జన చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి.