రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘విరాటపర్వం’ . నీదీ నాది ఒకటే కథ వంటి డిఫరెంట్ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగల డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా మొదలైన తర్వాత కొద్ది రోజులు షూటింగ్ బాగానే జరిగినా ఈ లోగా రానా కు హెల్త్ ప్లాబ్లంల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత అన్నీ సెట్ అయ్యి... మళ్లీ రానా సీన్ లోకి వచ్చి షూట్ మొదలెట్టారు. ఈ సమ్మర్ లో షూట్ ఫినిష్ చేసి, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అయితే ఈ ప్లానింగ్ కు కరోనా వచ్చి దెబ్బకొట్టింది. ఈ నేపధ్యంలో ఎప్పటి నుంచి షూటింగ్ ఉంటుంది..ఎప్పుడు రిలీజ్ ఉంటుందనేది చర్చగా మారింది. 

ఫిల్మ్ సర్కిల్స్  నుంచి అందుతున్న సమాచారం మేరకు.. లాక్ డౌన్ ఎత్తేసినా వెంటనే షూటింగ్లు పర్మిషన్స్ ఇవ్వరు. కొద్ది టైమ్ పడుతుంది. అయితే అప్పుడే అసలైన సమస్య వస్తుంది. రానా, సాయి పల్లవి కంబైంన్డ్ డేట్స్ దొరకాలి. సాయి పల్లవి..తమిళంలో బిజిగా ఉంది. ఆ షూటింగ్ లో పాల్గోవాలి.  మరో ప్రక్క రానా..అరణ్య సినిమా ని పూర్తి చేసి, రిలీజ్ చేయాలి. ఇవన్నీ చూస్తూంటే ఈ సంవత్సరం ఈ సినిమా వచ్చే అవకాసం లేదంటున్నారు. అయితే మరి నిర్మాతలు ఈ సమస్యను అధిగమించటానికి ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. 

ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.  ఈ చిత్రంలో అలనాటి బాలీవుడ్ హీరోయిన్ జరీనా వాహబ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటించనుంది. విరాట పర్వం చిత్రాన్ని సురేష్ బాబు భారీస్థాయిలో నిర్మించనున్నారు. ఈ చిత్రం తర్వాత రానా భారీ బడ్జెట్ చిత్రం హిరణ్యకశ్యపలో నటించాల్సి ఉంది.