తల్లిని అడిగి ఎక్స్ పోజ్ చేస్తోన్న హీరోయిన్!

too much hotness okay for my mom says amy jackson
Highlights

చిట్టిపొట్టి డ్రెస్సులతో యూత్ ని ఫిదా చేస్తోన్న అమీ జాక్సన్ అందాల ఆరబోత విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు

చిట్టిపొట్టి డ్రెస్సులతో యూత్ ని ఫిదా చేస్తోన్న అమీ జాక్సన్ అందాల ఆరబోత విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. ఈ మధ్య కాలంలో ఆమె షేర్ చేస్తోన్న ఫోటోలు మరీ శృతిమించుతున్నాయి. కానీ అమ్మడు మాత్రం తన అలవాట్లను విడిచి పెట్టడం లేదు.

షూటింగ్ లేని సమయంలో, టూర్లకు వెళ్లేప్పుడు రకరకాల ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తన ఎక్స్ పోజింగ్ మరీ ఎక్కువైందని ఆమెకే అనిపించినట్లు ఉంది. అందుకే తన తల్లిని అడిగిందట. దానికి ఆమె ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఓ ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.

'ఎక్స్ పోజింగ్ మితి మీరుతుందా అని అమ్మని అడిగితే.. 'మోర్ దెన్ ఓకే' అని చెప్పారు.. అందుకే ఈ ఫోటో షేర్ చేస్తున్నా' అంటూ ఎమీ తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టింది.  

 

loader