కరోనా వైరస్ కారణంగా హాలీవుడ్ సినిమాలు వాయిదా పడుతున్నాయి. రిస్క్ చేయకూడదని ఎవరు షూటింగ్స్ కూడా చేయడం లేదు.  అన్ని సినిమా ఇండస్ట్రీలను ఈ కరోనా వైరస్ చాలానే కలవరపెడుతోంది. ఇటివల హాలీవుడ్ స్టార్ యాక్టర్ కి కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ టామ్ హాంక్స్ వైరస్ భారిన పడిన  తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది.

ఆస్ట్రేలియాకి వెళ్లిన టామ్ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటానే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఆయన భార్య రీటా విల్సన్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.  వెంటనే చిక్కిత్స తీసుకున్న వారు వ్యాధి భారీ నుంచి తప్పించుకున్నారు. వైరస్ సోకకుండా సెలబ్రెటీలు సైతం అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టామ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సన్నిహితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. టామ్ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

ప్రస్తుతం తాను కుదురుకున్నాని అందరూ ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ ని సేఫ్ గా ఉంచడానికి తాము ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.  రీసెంట్ గా హ్యారీపోటర్‌ యాక్టర్ డేనియల్‌ ర్యాడ్‌క్లిఫ్‌కు కూడా వైరస్ సోకినట్లు వార్తలు రావడం అందరిని షాక్ గురి చేసింది. అది కూడా బిబిసి న్యూస్ పేరిట ట్వీట్ వెలువడంతో నిమిషాల్లో ఆ ట్వీట్ వైరల్ అయ్యింది. కరోనా సోకిన సెలబ్రేటిస్ లో ప్రముఖ వ్యక్తి ర్యాడ్‌క్లిఫ్‌ ఒకరని పేర్కొనడం ఆయన ఫ్యాన్స్ ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని ర్యాడిక్లిఫ్‌ ప్రతినిధి కొట్టిపరేశారు. ర్యాడిక్లిఫ్‌ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ.. ఆయనకు ఎలాంటి వైరస్ సోకలేదని సమాధానమిచ్చారు.