టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ తర్వాత ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన మరో ఇష్యూ అమెరికాలో జరుగుతున్న హైటెక్ సెలబ్రిటీ వ్యభిచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అమెరికన్ పోలీసులు మొగుడిమిడి కిషన్ అలియాస్ చెన్నపతి శ్రీరాజ్, అతని భార్య చంద్రకళ పూర్ణిమను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసినదే.

ఈ విచారణలో రోజుకో కొత్త విషయం వెల్లడవుతోంది. ఈ దంపతులిద్దరూ అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల పేరిట నకిలీ లెటర్‌హెడ్స్‌ని సృష్టించి, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను అమెరికాకు రప్పించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి, అక్కడి అధికారులు ఆయా సంఘాలను కూడా విచారించగా, వారు చెప్పినట్లుగా తాము ఆ తేదీలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని, సెలబ్రిటీలను ఆహ్వానించలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (టిఏఎస్‌సి), నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (నాట్స్), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వంటి పలు తెలుగు సంఘాల పేరిట 40కిపైగా నకిలీ లెటర్‌హెడ్స్ సృష్టించి టాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు ఈ విచారణలో తెలిసింది. 

ఇందుకు సంబంధించి ఆయా సంఘాలను విచారించగా, వారు తమకు దీనికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాంగగా, కిషన్ ఈమెయిల్స్‌ను పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. 

కిషన్ తన ఈమెయిల్స్ ద్వారా సెలబ్రిటీలకు ఎయిర్ టిక్కెట్లను ఖరీదు చేయటంతో పాటుగా దాదాపుకి పైగా నకిలీ పేర్లతో హోటళ్లను రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మెహ్రీన్ కౌర్ ( 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' ఫేమ్)ను కూడా పోలీసులు విచారించిన సంగతి తెలిసినదే.