టాలీవుడ్ సెక్స్ రాకెట్ కేసు: కిషన్ దంపతులకు పదేళ్ల జైలు శిక్ష

tollywood sex racket: final verdict date 11
Highlights

టాలీవుడ్ కు చెందిన కొందరు నటీమణులను ఈవెంట్స్ పేరిట అమెరికా తీసుకెళ్లి వారితో వ్యభిచారం చేయించిన కేసులో కిషన్ అతడి భార్య చంద్రకళను పోలీసులు అరెస్ట్ చేసిన 
సంగతి తెలిసిందే

టాలీవుడ్ కు చెందిన కొందరు నటీమణులను ఈవెంట్స్ పేరిట అమెరికా తీసుకెళ్లి వారితో వ్యభిచారం చేయించిన కేసులో కిషన్ అతడి భార్య చంద్రకళను పోలీసులు అరెస్ట్ చేసిన 
సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కోర్టు విచారమ ముగిసింది.

ప్రధాన నిందితుడిగా ఉన్న కిషన్ దంపతులను ఉత్తర ఇలినాయిస్ కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులో జులై 18న తుది తీర్పు వెల్లడించనుంది. అయితే వీరికి దాదాపు పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సెక్స్ రాకెట్ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. పలువురు తారలను విచారించి కిషన్ వ్యభిచారం చేయించాడని పక్కా సాక్ష్యాలతో కోర్టులో రుజువు చేశారు పోలీసులు. 

కొందరు హీరోయిన్ల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయిన డబ్బు వివరాలు, వారు అమెరికాకు ప్రయాణించిన తేదీలతో సహా పలు సాక్ష్యాలను అమెరికా పోలీసులు కోర్టుకి సమర్పించారు. సెక్స్ రాకెట్ కేసుతో పాటు వీసా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కూడా కిషన్ దంపతులకు 111శిక్ష పడింది. ఈ ప్రకారంగా దాదాపు 10 ఏళ్ల పాటు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 
 
 

loader