సెక్స్ రాకెట్: పోలీసుల విచారణలో ముగ్గురు హీరోయిన్లు

tollywood heroines attended for interrogation
Highlights

చికాగోకు చెందిన ఓ ఇండియన్ ఫ్యామిలీను అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని పోలీసులు 

చికాగోకు చెందిన ఓ ఇండియన్ ఫ్యామిలీను అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు ఆ దంపతులకు తనను ఇబ్బంది పెట్టొద్దని మెయిల్ ద్వారా చెప్పిన ఓ హీరోయిన్ ను విచారించారు. ఈ విచారణలో ఆమె విటులతో సెక్స్ లో పాల్గొనలేదని కేవలం వారితో కొంత సమయం టైమ్ పాస్ చేశానని చెప్పిందట. 

తాజాగా టాలీవుడ్ కు చెందిన ముగ్గురు హీరోయిన్లను పోలీసులు పిలిపించి విచారించినట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. సెక్స్ రాకెట్ నిర్వహించిన కిషన్ మరియు అతడి భార్యతో తమకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో హీరోయిన్ల నుండి రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ  ముగ్గురు హీరోయిన్లలో ఒకరు తెలుగు, తమిళ భాషల్లో మంచి పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్. 

మరో నటి శాండల్ వుడ్ నుండి టాలీవుడ్ కు వచ్చింది. గతంలో ఆమె కొన్ని తెలుగు సినిమాలు చేసింది. మూడో నటి ఇండస్ట్రీలో ఉన్న ఓ హీరోతో రిలేషన్షిప్ ఉందనే వార్త ఎప్పటినుండో వినిపిస్తోంది. ఈ ముగ్గురు కూడా తము కేవలం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కోసమే అమెరికా వెళ్లామని ఎలాంటి చట్టవిరుద్ధ పనులు చేయలేదని నిరూపించుకున్న తరువాతే పోలీసులు విడిచి పెట్టినట్లు తెలుస్తోంది.

 

loader