Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మకం.. అడ్డంగా బుక్కైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్..

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. అయినప్పటికీ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి.

tollywood choreographer arrested for Drugs
Author
First Published Aug 27, 2022, 5:10 PM IST

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. అయినప్పటికీ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ లో కూడా డ్రగ్స్ వివాదం కలకలం సృష్టించింది. కొన్ని రోజుల హడావిడి తర్వాత సెలెబ్రిటీలు క్లీన్ చిట్ తో బయట పడుతున్నారు. 

తాజాగా టాలీవుడ్ లో ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా బుక్కయ్యారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న గోపికృష్ణ అనే అనే వ్యక్తి గోవా నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. దీనితో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. 

పోలీసులు అతడి నివాసంలో సోదాలు నిర్వహించగా రూ 60 వేలు విలువైన 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, హ్యాష్ ఆయిల్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం పోలీసు అధికారులు గోపికృష్ణ ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించాడో అని ఆరా తీస్తున్నారు. ఇంకెవరైనా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారా అనే కోణంలో కూడానా దర్యాప్తు జరుగుతోంది. 

గతంలో టాలీవుడ్ లో నమోదైన డ్రగ్స్ కేసులో పూరి జాగన్నాధ్, ఛార్మి, తనీష్, తరుణ్, ముమైత్ ఖాన్ లాంటి వారు విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios