ఇషా శర్వాని అనే పేరు చాలా తక్కువమందికి తెలిసి ఉండొచ్చు. కానీ ఆమె బాలీవుడ్ లో నటిగా, డాన్సర్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. కేరళలో జన్మించిన ఈ 34 ఏళ్ల బ్యూటీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది. ఆమె కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. 

ఇషా హిందీలో 'గుడ్ బాయ్.. బ్యాడ్ బాయ్', లక్ బై ఛాన్స్, రాఖీ లాంటి చిత్రాల్లో నటించింది. ఇషా 2017నుంచి వెండి తెరకు దూరంగా ఉంటోంది. ఇటీవల ముగ్గురు వ్యక్తులు ఆమెని మోసం చేయడానికి ప్రయత్నించిన సంఘటనని ఢిల్లీ పోలీసులు బయటపెట్టారు. 

ప్రస్తుతం ఇషా శర్వాని, ఆమె కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియా లోని పెర్త్ నగరంలో నివాసం ఉంటున్నారు. ముగ్గురు వ్యక్తులు తాము ఆస్ట్రేలియాకు చెందిన ఆదాయపు పన్ను అధికారులం అని తమకు 5700 ఆస్ట్రేలియన్ డాలర్స్(దాదాపుగా రూ 3లక్షలు) డబ్బు ఇవ్వాలని బెదిరించారు. ఆ డబ్బుని వెస్ట్రన్ యూనియన్ బ్యాంక్ ద్వారా బదిలీ చేయాలని ఇషాని బెదిరించారు. 

దీనితో ఇషా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు త్వరగానే ఈ కేసుని ఛేదించారు. ఇషాని ఫోన్ లో బెదిరించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.