బిగ్ బాస్ రియాలిటీ షో వారం మొత్తం ఒక ఎత్తు, ఆదివారం ఒక ఎత్తు. ఆరు రోజులకు మించిన మజా ఆదివారం ఎపిసోడ్ లో ఉంటుంది. గేమ్స్, టాస్క్స్ తో పాటు ఇంటిలో నుండి ఒక సభ్యుడు ఎలిమినేట్ కావడం ఆసక్తి రేపుతుంది. ఎలిమినేషన్ సమయంలో కొనసాగే ఉత్కంఠ, ఎమోషన్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. నేటి ఎపిసోడ్ కూడా అనేక ఆసక్తికర సంఘటనలతో ఎంటర్టైనింగ్ గా సాగింది.
 
బిగ్ బాస్ సీజన్ 4 మొదలైన తరువాత మొదటిసారి ఎపిసోడ్ 8 మజా పంచింది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ దుమ్మురేపే డాన్సులు, జోష్ పంచే గేమ్స్ తో, నాగార్జున మార్క్ హోస్టింగ్ స్కిల్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉత్కంఠగా సాగింది. నలుగురిలో ఒక్కొక్కరూ సేఫ్ జోన్ లోకి ఎంటర్ అవుతుంటే, మిగిలిన సభ్యుల మధ్య టెన్షన్ పెరిగిపోయింది. 

మొదటిగా అఖిల్ సార్థక్ ఎలిమినేషన్ నుండి బయటపడ్డారని  తెలియగా, ఆ తరువాత మెహబూబ్ సేవ్ అయ్యారు. చివరిగా దివి, సూర్య కిరణ్ మిగిలారు. వీరిద్దరిలో ఒకరికి మంచి నీళ్లు ఇవ్వాలని కోరగా మోనాల్ సూర్య కిరణ్ కి ఇవ్వడం జరిగింది. నాగ్ సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యారని తెలియజేశారు. 

ఇంటి సభ్యులకు టాటా చెప్పిన సూర్య కిరణ్, బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. ఎలిమినేటై వెళ్ళిపోతున్న సూర్య కిరణ్ చేత నాగార్జున స్వభావాన్ని బట్టి ఒక్కొక్క జంతువు దగ్గర ఒక్కొక్కరి పేరు పెట్టాలని చెప్పారు. చాలా తెలివిగా ఎవ్వరూ బాధపడకుండా సూర్య కిరణ్ ఈ టాస్క్ పూర్తి చేసి, బిగ్ బాంబ్ ద్వారా దేవికి ఫేవర్ చేసి వెళ్లిపోయారు. 

ఇక ఇంటిలో నుండి ఒక కంటెస్టెంట్ వెళ్లిపోగా మరొక కంటెస్టెంట్ ఎంటర్ అయ్యాడు. కమెడియన్ కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. షోలో సభ్యులను,ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని నాగ్ కుమార్ సాయికి సూచించారు. షోకి రావడం వెనుక తన లక్ష్యాలను చెప్పిన కుమార్ సాయి కాన్ఫిడెంట్ గా హౌస్ లోకి ఎంటరైయ్యాడు.