Asianet News TeluguAsianet News Telugu

ట్రేడ్ టాక్:ఈ వారం సినిమాలు,ఏది హిట్,ఏవి ఫట్?


 మొదటి రోజే డల్ గా మొదలైన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా.. వీకెండ్ గడిచేసరికి మరింత డల్ అయిపోయింది. నిన్నటి ఆదివారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ రీతిలో షేర్ కూడా రాలేదంటే.. సినిమా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

This week trade talk , vivahabhojanambhu is best
Author
Hyderabad, First Published Aug 30, 2021, 12:02 PM IST

సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లోబాక్సాఫీస్ సందడి ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. హౌస్ ఫుల్స్ కావటం లేదు కానీ... వరస పెట్టి సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలో ఇరవైకు పైగా సినిమాలు రిలీజయ్యాయి కానీ.. ఏవీ కూడా పెద్ద హిట్టైన ధాకలాలేదు. ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ చిత్రాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. ఆ స్దాయికి తగ్గట్లుగా వర్కవుట్ కాలేదు.  తిమ్మరసు మూవీ ఫరవాలేదనిపించుకుంది. రాజ రాజ చోర చాలా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. అందుకు తగ్గట్లుగా కలెక్షన్లు లేవంటోంది ట్రేడ్. అయితే ఓటీటిలు ఈ సినిమాలను మంచి రేటుకు కొనుగోలు చేస్తున్నాయి కాబట్టి ఊరట.

ఇక వీకెండ్ లో మూడు చిత్రాలు థియోటర్స్ లో దిగాయి. కానీ ఏదీ చెప్పుకోదగిన స్దాయిలో లేదు. అన్నింటికి నిరాశ తప్పేలా లేదు.ఎన్నో ఎక్సపెక్టేషన్స్ మధ్య వచ్చిన సుధీర్ బాబు సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ వాటిని రీచ్ కాలేకపోయింది. క్లైమాక్స్ మినహా సినిమాలో విశేషాలేమీ లేవని.. మరీ ఓల్డ్ స్కూల్ లో ఉందని రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 550 థియేటర్లలో భారీ స్థాయిలోనే రిలీజ్ చేశారు. కానీ ఓపెనింగ్స్ కూడా గొప్పగా లేవు. మొదటి రోజు కోటిన్నరకు అటు ఇటుగా గ్రాస్ వచ్చింది. వీకెండ్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. 
 
మొదటి రోజే డల్ గా మొదలైన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా.. వీకెండ్ గడిచేసరికి మరింత డల్ అయిపోయింది. నిన్నటి ఆదివారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ రీతిలో షేర్ కూడా రాలేదంటే.. సినిమా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మరో ప్రక్క సుశాంత్ సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ పరిస్థితి అయితే దారుణం. అన్ని చోట్లా వాషౌట్ అన్నట్లే ఉంది. డిఫరెంట్ పాయింట్ తో ఉన్న భిన్నమైన చిత్రమే అయినా.. ఆ  పాయింట్‌ను డీల్ చేయడంలో గందరగోళం ఈ చిత్రానికి మైనస్ గా మారింది. దానికి తోడు ఓపెనింగ్స్ కూడా రాలేదు. సుశాంత్ కెరీర్లో మరో డిజాస్టర్ గా మారింది.

అలాగే శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్ర పోషించిన ‘హౌస్ ఆరెస్ట్’ కూడా అసలు రిలీజ్ అయ్యినట్లే చాలా మందికి తెలియలేదు. రొటీన్ కథాకథనాలతో సాగే ఈ పిల్లల సినిమా కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ లేవు. ఈ మూడు థియేట్రికల్ రిలీజ్‌లతో పోలిస్తే సోనీ లివ్ ఓటీటీ ద్వారా రిలీజైన ‘వివాహ భోజనంబు’ పరిస్థితి ఫరవాలేదు అన్నట్లు కనిపిస్తోంది.   అక్కడక్కడా కామెడీ బాగానే వర్కవుట్ కావడంతో టైంపాస్‌కు ఢోకా లేదని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios