Asianet News TeluguAsianet News Telugu

భారతీయులు ఆన్‌లైన్‌లో ఏ వీడియోలు ఎక్కువ చూస్తున్నారో తెలుసా..?

భారతీయుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తున్నారు. దాదాపు రోజుకు గంటపాటు వీడియోలు  చూస్తున్నట్టుగా వెల్లడించింది. అండర్‌ స్టాండింగ్‌ ఇండియాస్‌ ఆన్‌ లైన్ వీడియో వ్యూయర్‌ అనే పేరుతో ఈ సర్వే వివరాలను వెల్లడించింది గూగుల్.

This is the average time an Indian spends while watching online videos
Author
Hyderabad, First Published Jun 5, 2020, 9:48 AM IST

కరోనా లాక్ డౌన్‌ కారణం ప్రపంచమంతా ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో కూడా దాదాపు రెండు నెలల పాటు లాక్‌ డౌన్ విధించటంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. వినోద పరిశ్రమ కూడా పూర్తిగా మూత పడటం, థియేటర్లు, సీరియల్స్‌ కూడా ఆగిపోవటంతో ప్రజలు ఎంటర్‌టైన్మెంట్‌ కోసం డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. డిజిటల్‌ వీడియోలు చూస్తున్నవారి సంఖ్య ఏ స్థాయిలో పెరిగింది. ఏ భాషల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు అనే లెక్కలు వెల్లడించింది.

భారతీయుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తున్నారు. దాదాపు రోజుకు గంటపాటు వీడియోలు  చూస్తున్నట్టుగా వెల్లడించింది. అండర్‌ స్టాండింగ్‌ ఇండియాస్‌ ఆన్‌ లైన్ వీడియో వ్యూయర్‌ అనే పేరుతో ఈ సర్వే వివరాలను వెల్లడించింది గూగుల్. ఈ సర్వే ప్రకారం హిందీ వీడియోలను ఎక్కువగా చూస్తున్నారని తేల్చింది. దాదాపు 54 శాతం మంది హిందీ వీడియోలనే చేస్తున్నారట. ఆ తరువాత ఎక్కువగా 16 శాతం మంది ఇంగ్లీష్ వీడియోలను చూస్తున్నారు.

తెలుగు వీడియోలు మూడో స్థానంలో నిలిచాయి. దాదాపు ఏడు శాతం మంది తెలుగు వీడియోలు చేస్తున్నారు. తరువాతి స్థానంలో కన్నడ ఆరు శాతం, తమిళ వీడియోలను ఐదు శాతం, బెంగాళీ వీడియోలను మూడు శాతం చూస్తున్నారు. భవిష్యత్తుల్లో ఆన్‌లైన్‌లో వీడియోలు చూసే వారి సంఖ్య మరింత భారీగా పెరిగే అవకావం ఉందని గూగుల్‌ వెల్లడించింది. రానున్న ఏడాదిలో ఈ సంఖ్య 500 మిలియన్లకు (50 కోట్లు) చేరు అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేకాదు వీరిలో 37 శాతం ప్రజలు రూరల్‌ ఏరియాల నుంచే వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios