డ్రగ్స్ ఆరోపణలు బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. సుశాంత్ డెత్ కేసు విచారణలో డ్రగ్స్ కోణం బయటపడగా రియా చక్రవర్తి ఆమె తమ్ముడు షోవిక్ అరెస్ట్ కావడం జరిగింది. రియా డ్రగ్స్ కొనుగోళ్లు జరిపిన డ్రగ్ పెడ్లర్ ని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రియా చక్రవర్తి విచారణలో సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు బయటపెట్టారని తెలుస్తుంది. దీనితో త్వరలో వీరిద్దనికి కూడా అధికారులు విచారించే అవకాశము ఉంది. 

రకుల్ ప్రీత్ పేరు బయటికి వచ్చిన నేపథ్యంలో టాలీవుడ్ కి ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది. రియా కాల్ లిస్ట్ లో హీరో రానా పేరుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం దుమారం రేపుతోంది. సంజనా గల్రానితో పాటు మరికొందరు అరెస్ట్ కాబడ్డారు. కాగా నటుడు నవదీప్ ని డ్రగ్స్ ఆరోపణల గురించి అడుగగా, తనకు ఎటువంటి బాధ లేదు, మీరు బాధపడకండి, ఇలాంటి విషయాలు వదిలేసి పనికొచ్చే పనులు చేసుకుంటే బెటర్ అని ఆయన కామెంట్ చేయడం జరిగింది. 

 మూడేళ్ళ క్రితం టాలీవుడ్ పై డ్రగ్ ఆరోపణలు ప్రకంపనులు రేపాయి. టాలీవుడ్ కి చెందిన 15మంది ప్రముఖులు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి, రవితేజ,తరుణ్, మొమైత్ ఖాన్ వంటి స్టార్స్ ఈ లిస్టులో ఉన్నారు. అలాగే నటుడు నవదీప్ కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరు విచారణలో పాల్గొనడం జరిగింది. ఒత్తిడుల నేపథ్యంలో ఈ కేసు పక్కదారి పట్టించారని అప్పట్లో విమర్శలు రావడం జరిగింది.