Asianet News TeluguAsianet News Telugu

సాయి ధరమ్ తేజ్ పై ప్రేమ దాచుకోలేకపోయిన హీరోయిన్ ? వీడియో వైరల్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. బైక్ పై వెళుతూ ప్రమాదవశత్తూ కిందపడ్డాడు. 

Thikka Heroine Larissa Bonesi tweet on Sai Dharam Tej
Author
Hyderabad, First Published Sep 23, 2021, 2:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. బైక్ పై వెళుతూ ప్రమాదవశత్తూ కిందపడ్డాడు. దీనితో గాయాలపాలైన తేజు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం కుదుట పడుతోంది. తేజు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

తేజు ప్రమాదానికి గురైనప్పుడు త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఇంటికి రావాలని అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు.  ఓ ప్రత్యేక వ్యక్తి మాత్రం తాజాగా సాయిధరమ్ తేజ్ గురించి సోషల్ మీడియాలో  పెట్టింది. 

తేజు ప్రమాదానికి గురైన తర్వాత ఆమె పెట్టిన తొలి పోస్ట్ ఇదే. ఆలస్యంగా అయినా ఓ మెమొరబుల్ వీడియో షేర్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. తేజతో సంథింగ్ సంథింగ్ సాగిస్తోంది అంటూ వార్తల్లో నిలిచిన బ్రెజిల్ బ్యూటీ లారీసా బోనేసి. లారీసా తేజతో కలసి తిక్క చిత్రంలో నటించింది. అప్పట్లో వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోంది అంటూ వార్తలు వినిపించాయి. 

తాజాగా లారీసా తేజుపై తన ఇష్టాన్ని దాచుకోలేకపోయింది. తేజు ప్రమాదానికి గురికావడంపై పరోక్షంగా ట్వీట్ చేసింది. 'మళ్ళీ నీ చిరునవ్వు చూసేందుకు ఎదురుచూడలేకున్నాను.. నా తేజుపై నమ్మకం ఉంది' అంటూ లారీసా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు తిక్క ఆడియో వేడుకలో తనతో కలసి తేజు నవ్వులు చిందిస్తున్న వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. లారీసా పోస్ట్ పై అభిమానులు కామెంట్స్ తో స్పందిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios