Asianet News TeluguAsianet News Telugu

రెండో వారం ఎలిమినేషన్‌కి నామినేటైన తొమ్మిది మంది వీరే

ఎలిమినేషన్‌ ప్రక్రియ అయిన బోట్‌ ఎపిసోడ్‌లో.. బోట్‌ మొత్తంగా తొమ్మిది తీరాల గుండా వెళ్తుందని, ప్రతి తీరం వద్ద హారన్‌ వస్తుందని, హారన్‌ మోగిన ప్రతి సారి, అంటే ప్రతీ తీరం వద్ద ఒక్కరు దిగిపోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ కండీషన్స్ పెట్టారు. 

these are the nine members who nominated for   eliminate in the second week biggboss4
Author
Hyderabad, First Published Sep 14, 2020, 10:57 PM IST

బిగ్‌బాస్‌ 4 ఎనిమిదో రోజు మొత్తంలో బోట్‌ ఎపిసోడ్‌ కాస్త రంజుగా సాగింది. ఎలిమినేషన్‌ ప్రక్రియ అయిన బోట్‌ ఎపిసోడ్‌లో.. బోట్‌ మొత్తంగా తొమ్మిది తీరాల గుండా వెళ్తుందని, ప్రతి తీరం వద్ద హారన్‌ వస్తుందని, హారన్‌ మోగిన ప్రతి సారి, అంటే ప్రతీ తీరం వద్ద ఒక్కరు దిగిపోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ కండీషన్స్ పెట్టారు. అలా దిగిపోయిన వాళ్లు ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయినట్టు లెక్క. 

ఈ ఎపిసోడ్‌ కాస్త ఆసక్తి కరంగా సాగింది. బోట్‌లో 15సీట్లు ఉన్నాయి. పదిహేను మంది కూర్చున్నారు. కెప్టెన్‌ లాస్యకి ఎలిమినేషన్‌ నుంచి ముందే తప్పుకుంది. ఆమెను రెండో వారం ఎలిమినేషన్‌ నుంచి బిగ్‌బాస్‌ మినహాయింపు ఇచ్చారు. 

ఇక మిగిలిన 15 మందిలో ముందు ఎవరు దిగిపోవాలనేది పెద్ద చర్చే సాగింది. గంగవ్వని అందరు సూచించగా.. మొదట ఆమె దిగనని చెప్పేసింది. కానీ హారన్‌ మోగేసరికి దిగేసి ఆశ్చర్య పరిచింది. దిగినందుకు ఆమె చాలా లైట్‌ తీసుకుంది. రెండో తీరం వద్ద నోయల్‌ దిగిపోయాడు. మూడో తీరం వద్ద మోనాల్‌ గజ్జర్‌ దిగింది.  

నాలుగో తీరం వద్ద హారన్‌ మోగే సమయంలో పెద్ద డిస్కషన్‌ జరిగింది. కుమార్‌ సాయి తాను అందరు దిగమంటే దిగుతానని, అందుకు కారణం చెప్పాలన్నారు. ఆ డిస్కషన్‌లో జరుగుతుండగానే హారన్‌ మోగింది. టక్కున్న సోహైల్‌ దిగిపోయాడు. ఐదో హారన్‌ మోగినప్పుడు కరాటే కళ్యాణి దిగిపోయింది. ఆరో తీరం వద్ద అమ్మ రాజశేఖర్‌ దిగిపోయాడు. 

మరోసారి కుమార్‌ సాయి విషయంలో సభ్యులకు వాగ్వాదం జరిగింది. అందరు ఆయన్ని సూచించారు. వాగ్వాదం అనంతరం ఏడో హారన్‌ వద్ద కుమార్‌ సాయి దిగిపోయాడు. ఆ తర్వాత ఎనిమిదో హారన్‌ వద్ద హారిక
దిగింది. చివరగా అభిజిత్‌ దిగిపోయారు. ఇలా మొత్తం ఈ వారం తొమ్మిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. ఇప్పటికే గంగవ్వ మొదటివారం ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios