Asianet News TeluguAsianet News Telugu

వీకెండ్ లో విజువల్ ట్రీట్ అందించే 5 హాలీవుడ్ చిత్రాలు.. థియేటర్, ఓటిటి రిలీజ్ డీటెయిల్స్

ఒకప్పుడు హాలీవుడ్ చిత్రాలు ఇండియాలో కేవలం ప్రధాన నగరాల్లో మాత్రమే కనిపించేవి. సూపర్ హీరో చిత్రాలకు క్రేజ్ పెరిగాక హాలీవుడ్ చిత్రాలు ఇండియన్ మూవీస్ కి పోటీగా ఇక్కడ విడుదలవుతున్నాయి.

These 5 Hollywood movies gives visual treat this weekend
Author
Hyderabad, First Published Sep 3, 2021, 12:55 PM IST

ఒకప్పుడు హాలీవుడ్ చిత్రాలు ఇండియాలో కేవలం ప్రధాన నగరాల్లో మాత్రమే కనిపించేవి. సూపర్ హీరో చిత్రాలకు క్రేజ్ పెరిగాక హాలీవుడ్ చిత్రాలు ఇండియన్ మూవీస్ కి పోటీగా ఇక్కడ విడుదలవుతున్నాయి. మర్వెల్ అవెంజర్స్ కి ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. 

ప్రస్తుతం తెలుగు సినిమాలు కూడా పెద్దగా రిలీజ్ కు నోచుకోని ఈ టైంలో హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ ల సందడి పెరుగుతోంది. ఈ వీకెండ్ లో 5 హాలీవుడ్ చిత్రాలు అటు థియేటర్స్ ఇటు ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాలు వివరాలు చూద్దాం. 

మార్వెల్ సంస్థ మొట్టమొదటి ఆసియన్ సూపర్ హీరో మూవీ షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ పూర్తి ఆసియా తారాగణంతో తెరకెక్కింది. ఈ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్స్ లో విడుదలవుతోంది. సిము లియు, ఆక్వాఫినా, మెంగేర్ జాంగ్, ఫలా చెన్, బెనెడిక్ట్ వాంగ్, మిచెల్ యో, టోనీ ల్యూంగ్ లు నటించిన ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల విజువల్ ట్రీట్ అందించేందుకు థియేటర్స్ లోకి రానుంది. 

ఇక ప్రఖ్యాత నటుడు విన్ డీజిల్ క్రేజ్ ప్రాంచైజీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 మూవీ సెప్టెంబర్ 2, 2021 న థియేటర్లలోకి వచ్చేసింది. 

ఇక ఓటిటి విషయానికి వస్తే.. అమెజాన్ ఒరిజినల్ మూవీ సిండ్రెల్లా సెప్టెంబర్ 3 నుంచి స్టీమింగ్ కానుంది. స్కార్లెట్ జోహన్సన్ నటించిన బ్లాక్ విడో అంతర్జాతీయంగా విడుదలైన తర్వాత ఇప్పటికి ఇండియాలో విడుదల అవుతోంది. విదేశాలలో సంచలనం సృష్టించిన ఈ మార్వెల్ చిత్రం చివరకు ఇండియన్ ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ అందించడానికి డిస్నీ+హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 3 న విడుదల కానుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో మనీ హీస్ట్ సీజన్ 5 సెప్టెంబర్ 3న రిలీజ్ కానుంది. సో హాలీవుడ్ మూవీ లవర్స్ గెట్ రెడీ. 

Follow Us:
Download App:
  • android
  • ios