నేడు బిగ్ బాస్ హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. మొదటివారానికి గాను మొత్తం ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ కొరకు నామినేట్ అయ్యారు. వీరిలో అభిజిత్, జోర్దార్ సుజాత, గంగవ్వ ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేషన్ నుండి తప్పించబడ్డారు. ఇక మిగిలిన దివి, సూర్య కిరణ్, మెహబూబ్ మరియు అఖిల్ సార్థక్ నుండి ఒకడు ఎలిమినేట్ కానున్నారు. నేడు ఎలిమినేషన్ లేకపోతే బాగుంటుందని ఇంటి సభ్యులు ఆశపడుతున్నారు. ఇదే విషయాన్ని ర్యాప్ సాంగ్ రూపంలో హోస్ట్ నాగార్జునకు తెలియజేశారు. 

ఐతే బిగ్ బాస్ సీతయ్య, ఎవరి మాట వినడు, ఎలిమినేషన్ తప్పదని నాగార్జున చెప్పారు. కాగా మిగిలిన నలుగురు సభ్యులలో ఎవరు హౌస్ నుండి వెళ్ళిపోతారనే ఆసక్తి కొనసాగుతుంది. తాజా ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ ఎంటర్ అవుతున్నారని నాగార్జున చెప్పారు. అలాగే ఆ కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్న దృశ్యాన్ని కూడా ప్రోమోలో చూపించారు. కానీ హౌస్ లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న ఆ వ్యక్తి ఎవరనేది స్పష్టంగా చూపించలేదు. మరికొన్ని గంటల్లో ప్రసారం కానున్న షోలో ఇది స్పష్టం కానుంది. 

వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఇస్తున్న ఆ వ్యక్తి కమెడియన్ సాయి కుమార్ అని తెలుస్తుంది. ఈ రోజుల్లో సినిమాలో సాయి కుమార్ హీరో ఫ్రెండ్ రోల్ లో కనిపించారు. అలాగే మరికొన్ని సినిమాలలో సాయి కుమార్ నటించడం జరిగింది.అలాగే జబర్ధస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ కూడా అవకాశం కలదని సమాచారం. ఇక ఎలిమినేషన్  విషయానికి  వస్తే డైరెక్టర్ సూర్య కిరణ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.