వచ్చే వారం రంగ రంగ వైభవంగా మూవీ విడుదలవుతుండగా కనీస బజ్ లేదు. ఈ మూవీ గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు.
కొండపొలం మూవీతో అట్టర్ ప్లాప్ కతాలో వేసుకున్నాడు హీరో వైష్ణవ్ తేజ్. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికలపడింది. కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. ఉప్పెనతో రాబట్టుకున్న కొండపొలంతో పోయింది. ఈ మూవీలోని వైష్ణవ్ తేజ్ నటన విమర్శల పాలైంది. మరో హిట్ తో ఫార్మ్ లోకి రావాలని ఈ యంగ్ హీరో కోరుకుంటున్నారు.
ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా సెప్టెంబర్ 2న విడుదల కానుంది ఈ మూవీపై పరిశ్రమలో ఎలాంటి బజ్ లేదు. కనీసం యూత్ లో కూడా సినిమాపై హైప్ లేదు. మెగా హీరోలు చెప్పుకోదగ్గ స్థాయిలో రంగ రంగ వైభవంగా చిత్రాన్ని ప్రమోట్ చేయడం లేదు. అదే సమయంలో పిఆర్ టీం విఫలమైనట్లు కనిపిస్తుంది. విడుదలకు వారం రోజులకు లేకున్నా సందడి కరువైంది.
ఓపెనింగ్స్ కి తీవ్రంగా దెబ్బతీసే ఈ పరిమాణం మంచిది కాదు. దర్శకుడు గిరీశాయ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.
