‘తెల్లవారితే గురువారం’ మూవీ రివ్యూ
కొత్తపాయింట్ తో వచ్చే రొమాంటిక్ కామెడీలను మనవాళ్లు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. అయితే ఆ కొత్త అనేదే చాలా సార్లు చెత్తగా మారిపోతోంది. తాజాగా ‘మత్తు వదలరా’ సినిమా తర్వాత ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా చేసిన రొమాంటిక్ కామెడీ ‘తెల్లవారితే గురువారం‘. రిలీజ్ కు ముందు మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఎంటర్టైం చేసింది, ఎంత రొమాన్స్ పండించింది..ఏ మేరకు కామెడీని సినిమాలో పండించిందో రివ్యూలో చూద్దాం..
కొత్తపాయింట్ తో వచ్చే రొమాంటిక్ కామెడీలను మనవాళ్లు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. అయితే ఆ కొత్త అనేదే చాలా సార్లు చెత్తగా మారిపోతోంది. తాజాగా ‘మత్తు వదలరా’ సినిమా తర్వాత ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా చేసిన రొమాంటిక్ కామెడీ ‘తెల్లవారితే గురువారం‘. రిలీజ్ కు ముందు మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఎంటర్టైం చేసింది, ఎంత రొమాన్స్ పండించింది..ఏ మేరకు కామెడీని సినిమాలో పండించిందో రివ్యూలో చూద్దాం..
కథేంటి
అదో పెద్దలు కుదిర్చిన పెళ్లి. నైట్ రిసెప్షన్ తెల్లవారితే గురువారం పెళ్లి ముహూర్తం. అంతా హంగామా..హడావిడి..సంతోషం..సరదాలు. కానీ పెళ్లి కొడుకు వీరేంద్ర అలియాస్ వీరు(శ్రీసింహ)కు ఆ పెళ్లి ఇష్టం లేదు. మొహంలో నవ్వూ,తుళ్లూలేదు. కారణం...ఆల్రెడీ ఈ పెళ్లి కొడుకు మరో అమ్మాయి డాక్టర్ కృష్ణవేణి(చిత్ర శుక్లా)తో ప్రేమలో పడటం. దాంతో ఎలగైనా పెళ్లి ఆపుచేయాలని ప్రయత్నించినా అతని వల్ల కాదు. దాంతో వేరేదారిలేక పెళ్లి నుంచి జంప్ అవుతాడు. అదే సమయంలో పెళ్లి కూతురు మధు (మిషా నారంగ్) కూడా పారిపోయే ప్రయత్నంలో ఉంటుంది. అందుకు కారణం ఆమెకు పెళ్లి అంటే ఉన్న భయమే. విడివిడిగా కళ్యాణ మండపం నుంచి పారిపోతున్న వీరిద్దరూ కలిసి ప్రయాణం మొదలెడతారు. ఈ క్రమంలో ఏం జరిగింది. చివరకు వీరి జర్నీ ఎలా ముగిసింది,గురువారం పెళ్లి అయ్యిందా అనేది తెలుసుకోవాలంటే ఆ కళ్యాణ మండపం దాకా వెళ్లక్కర్లేదు..మీ దగ్గర్లో థియోటర్ కు వెళితే చాలు.
ఎనాలసిస్..
రొమాంటిక్ కామెడీల్లో రొటీన్ జరిగే అంశాలే ఈ సినిమాలోనూ తుచ తప్పకుండా జరుగుతూ పోతాయి. మొదట ఒకరినొకరు వద్దునుకున్న వీరిద్దరూ తిరిగి ఎలా ఒకటయ్యారనేది ఎంత ఇంట్రస్టింగ్ గా చెప్తే అంత బాగుంటుంది. ఎందుకంటే సినిమా చూసే ప్రతీ ఒక్కరికీ ఈ జంట చివరకు పెళ్లి చేసుకుంటారని తెలుసు. హీరో,హీరోయిన్స్ ఒకటి అవుతారనే మినిమం నాలెడ్జ్ ఉంది. అలాంటప్పుడు మధ్యలో వచ్చే సన్నివేశాలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. పెళ్లి ముహూర్తానికి ముందు ఇంటి నుంచి పారిపోయినవాళ్ల గురించి వార్తల్లో వినపడుతూనే ఉంటుంది.ఆ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని కథ అల్లారు. మరి కొద్ది గంటల్లో పెళ్లి చేసుకోబోయే ఇద్దరూ పెళ్లి మంటపం నుంచి పారిపోవడానికి ప్రయత్నించే సీన్ ఖచ్చితంగా కథలో లీనం చేసింది. అయితే ఆ తర్వాత కానీ మధ్యలో వచ్చే ఆ ఇద్దరి ఫ్లాష్ బ్యాక్ లు కానీ.. తర్వాత వీరి జర్నీ కానీ ఇంట్రస్టింగ్ గా తెరపై ప్రెజెంట్ చేయడంలో సిల్లీగా సీన్స్ పేర్చి ... కొత్త దర్శకుడు మణికాంత్ గెల్లి విఫలమయ్యాడు. పారిపోతున్న ఇద్దరూ చెప్పుకునే ప్లాష్ బ్యాక్ లలో ఏదీ ఎంగేజ్ చేయలేకపోయింది. తనకు యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో ఉన్నప్పుడు హీరో తనకు వైద్యం చేసే డాక్టరునే ప్రేమిస్తాడు.ఆ తర్వాత వేరే కారణంతో బ్రేకప్. ఇప్పుడు ఆ డాక్టర్ ని మర్చిపోలేక బయిలుదేరటం. మరోవైపు హీరో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ అయితే మరీ దారణం. ఆమె పెళ్లి పట్ల విముఖత పెంచుకోవడానికి చూపించే కారణం భయం. ఇలా ఇద్దరి ప్లాష్ బ్యాక్ లతో ఇంట్రస్ట్ లేక సీన్స్ వచ్చిపోతాయి. సెకండాఫ్ లో అయినా కథ పరుగెడుతుందేమో అంటే అక్కడా ఇంట్రస్టింగ్ సీన్స్ పడలేదు. దాంతో సినిమా అంతా తెల్లవారితే ఏమిటి...తెల్లారకపోతే ఏమిటి అన్నట్లు తయారైంది. ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ గా మారాయి.
టెక్నికల్ గా ..
దర్శకుడిగా మణికాంత్ తొలి చిత్రం స్క్రిప్టు దశలోనే ఫెయిలైంది. ట్రీట్మెంట్ సరిగ్గా రాసుకుని ఉంటే ఈ సినిమా వేరే విధంగా ఉండేది. సినిమాలో చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. భైరవ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీ సీన్స్ లో బాగా ప్లస్ అయ్యింది. ఇక ఎడిటర్ సీన్స్ ని ఇంకా ట్రీమ్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. డైలాగులు కొన్ని చోట్ల బాగా నవ్వించాయి.
నటీనటుల్లో సింహా బాగా చేస్తాడని తొలి సినిమాలోనే ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాలో అది కంటిన్యూ అయ్యింది. హీరోయిన్ మిషా నాంగర్ అమాయకంగా, పక్కింటి అమ్మాయి లా కనిపించింది. క్లైమాక్స్ లో అదరకొట్టింది. డాక్టర్ గా చేసిన చిత్రా శుక్లా చూడ్డానికి బాగుంది. నటన పర్వాలేదు. ఇక మరోసారి సత్యకు మంచి క్యారక్టర్ పడింది. వైవా హర్ష సైతం ఉన్నంతలో బాగానే నవ్వించాడు.
ఫైనల్ థాట్
ఇలాంటి కథలకు ట్రీట్మెంట్ సరిగ్గా కుదరకపోతే ప్రేక్షకులు వీటిని సరిగ్గా ట్రీట్ చేయరు.
Rating:2
ఎవరెవరు...
సంస్థ: వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: శ్రీసింహా కోడూరి, మిషా నారంగ్, చిత్ర శుక్లా, రాజీవ్ కనకాల, సత్యా, అజయ్, వైవా హర్ష, శరణ్యా ప్రదీప్, గిరిధర్, ప్రియ, రవివర్మ, పార్వతి, సిరి హనుమంత్, మౌర్య, పద్మావతి తదితరులు;
సంగీతం: కాలభైరవ;
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు;
రచన: నాగేంద్ర పిళ్లా;
ఎడిటర్: సత్య గిడుతూరి;
పాటలు: కిట్టు విస్సాప్రగడ, రఘురామ్, కృష్ణ వల్లెపు;
నిర్మాతలు: రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని;
దర్శకత్వం: మణికాంత్ గెల్లి;
విడుదల: 27-03-2021