Asianet News TeluguAsianet News Telugu

‘ఘోస్ట్’ టైటిల్ తో నాగ్, వేశ్య పాత్రలో కాజల్

నాగార్జున “ఘోస్ట్”గా మారాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 

The title and first look poster of Nagarjuna's Ghost movie is out!
Author
Hyderabad, First Published Aug 29, 2021, 12:30 PM IST

హీరో నాగార్జున ప్రస్తుతం దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీస్తున్న యాక్షన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి చేసుకొంది. ఈ రోజు ఆదివారం నాగార్జున (జనవరి 29) బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమా టైటిల్ తో కూడిన పోస్టర్ విడుదల చేసారు. ఈ సినిమాకి “ఘోస్ట్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ లో నాగ్ కత్తి పట్టుకుని శత్రువులను వేటాడుతున్నాడు. కొంతమంది విలన్లు ఆయన ముందు మోకరిల్లి కన్పిస్తున్నారు. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న విదేశీ బ్యాడ్డీలు, లండన్ ల్యాండ్‌స్కేప్ పిక్ చూస్తుంటే సినిమా ఇంటర్నేషనల్ స్టోరీ లైన్ తో రూపొందబోతున్నట్లు అన్పిస్తోంది.

నాగార్జున ఇందులో విక్రమ్ గాంధీ అనే పాత్రలో కనిపిస్తారు. “ఘోస్ట్”లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ గోవాలో పూర్తైంది. రెండో షెడ్యూల్‌ను బుధవారం నుంచి హైదరాబాద్‌లో ఆరంభించారు. "హైరేంజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఇందులో నాగార్జున ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ప్యాక్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇండియాలోని ప్రధాన నగరాలు, విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశాం" అని నిర్మాతలు అన్నాయి. 

నాగార్జున ఇందులో రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ఆయనకు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. సినిమాలో ఈమె ఎక్కువ భాగం వేశ్యగా.. చివర్లో మాత్రం స్పైగా కనిపించబోతుందట.  తీవ్రవాదుల గుట్టు రట్టు చేయడానికి తన అందచందాలతో వాళ్లను ఆకట్టుకుంటూ.. వాళ్ళతో రొమాన్స్ చేస్తూ అక్కడి రహస్యాలను తన డిపార్ట్మెంట్ కు అందజేసే పాత్ర ఇది. ఒకవైపు గూడాచారి, మరోవైపు వేశ్య ఈ రెండూ కలగలిపి ఉన్న పాత్రను కాజల్ అద్భుతంగా పోషిస్తుందని తెలుస్తోంది.అంతే కాదు ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌లో కూడా కాజల్‌ నటించబోతుందట. ఏదేమైనా.. పెళ్లి తర్వాత ఇలాంటి పాత్రలు చేయడం చిన్న విషయమేమి కాదు. తెరపై వేశ్యగా కాజల్‌ ఎలా రక్తి కట్టిస్తుందో చూడాలి మరి. నాగార్జున ఈ సినిమాతో పాటు బంగార్రాజు అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios