బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. గత ఏడాది కాలంలో ఆయన రూ.56 కోట్లు ఆర్జించి ఫోర్బ్స్ జాబితాలో చేరారు. ఇది ఇలా ఉండగా.. షారుఖ్ తాను ఇప్పటివరకు కొన్న వాటిల్లో అత్యంత ఖరీదైనది బాంద్రాలోని తన ఇల్లని షారుఖ్ అన్నారు.

షారుఖ్ ఇల్లు మన్నత్ తెలియని వారు ముంబైలో ఉండరు. ఆయనని కలుసుకోవడం కోసం ఆయన ఇంటి ముందు పడిగాపులు గాస్తుంటారు. ముంబైలో బీచ్ తో పాటు దానికి ఎదురుగా ఉండే షారుఖ్ మన్నత్ కూడా ఫేమసే.. అయితే ఇప్పుడు ఆ ఇంటి విలువ ఎంతో తెలుసా.. దాదాపు రూ.200 కోట్లు.

ఇటీవల రేడియో మిర్చీతో ముచ్చటించిన షారుఖ్.. తన ఇంటి గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ''నేను డిల్లీ నుండి వచ్చిన వ్యక్తిని. బంగ్లాలో మాత్రమే నివసించాలనేది అక్కడి వారి అభిప్రాయం. కానీ ముంబైలో అందరూ అపార్ట్మెంట్స్ లో జీవిస్తుంటారు. కానీ డిల్లీలో ఆర్థికంగా స్థిరపడని వారు కూడా బంగ్లాలోనే జీవిస్తుంటారు. నేను ముంబైకి రాకముందే పెళ్లి జరిగింది.

నా భార్యతో కలిసి అపార్ట్ మెంట్ లో ఉండాలని అనుకున్నాను. కానీ మా అత్త గారు ఇంత చిన్న ఇంటిలో ఉంటావా అని అనేవారు. నేను మొదటిసారి మన్నత్ ని చూసినప్పుడు డిల్లీలో ఇళ్లు గుర్తొచ్చాయి. అందుకే కొన్నాను. నేను ఇప్పటివరకు కొన్ని వాటిలో అతి ఖరీదైనది ఇదే'' అంటూ చెప్పుకొచ్చారు.