బిగ్‌బాస్‌4 నాల్గో వారంలోకి ఎంటరయ్యారు. ఓ వైపు ఎలిమినేషన్‌ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఏడుగురు నామినేట్‌ అయ్యారు. అయితే సోమవారం ప్రారంభంలో వచ్చిన గేమ్‌ ఎపిసోడ్‌ బాగా ఆకట్టుకుంది. అదే సమయంలో మోనాల్‌, అవినాష్‌ మధ్య వచ్చిన ఎపిసోడ్‌ నవ్వించింది.

ఆ తర్వాత బిగ్‌బాస్‌ క్రియేట్‌ చేసిన డిటెక్టివ్‌ ఎపిసోడ్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఇది చాలా సేపు సాగింది. కానీ మొత్తంగా బోర్‌ కొట్టించింది. వాళ్ళ ఎంక్వైరీ ఏంటో, వాళ్ళ కాంప్లెయింట్‌ ఏంటో అర్థం కాని విధంగా, చాలా గందరగోళంగా సాగింది. 

ఒక్కొక్కరిని పిలిచి వీరు చేసే హడావుడి చిరాకు తెప్పించింది. ఇప్పటికే బిగ్‌బాస్‌4 రేటింగ్‌ రెండో వారం నుంచి పడిపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా డల్‌గా సాగడం మరింత నిరాశకు గురి చేస్తుందని అభిమానులు అంటున్నారు. మరి ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ పెంచుతారా? అన్నది చూడాలి. అయితే ఈ సారి అందరి దృష్టి స్వాతి దీక్షిత్‌పై పడింది. కానీ ఆశించిన స్థాయిలో ఆమె ఎంటర్‌టైన్‌ చేయడం లేదు.