పదమూడేళ్ల వయసులో నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఛార్మి చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. ఈరోజు ఛార్మి తన 31వ జన్మదిన వేడుకలు జరుపుకొంటుంది.

ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నటిగా అన్ని రకాల పాత్రలు పోషించిన తనకు ఇప్పుడు నిర్మాతగా పని చేయడం సంతృప్తినిస్తోందని.. ఇకపై నటిగా కనిపించే ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ మధ్య చోటుచేసుకున్న టాలీవుడ్ డ్రగ్స్ వివాదంలో ఛార్మి పేరు వినిపించింది. సిట్ విచారణకు కూడా హాజరైంది.

దీనిపై స్పందించిన ఆమె తన జీవితంలో అది వరస్ట్ ఫేజ్ అని చెప్పింది. ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని.. ఎంతో అవమానంగా ఫీలైనట్లు చెప్పింది. తన తల్లితండ్రులు కూడా ఎంతో బాధ పడ్డారని, విషయం తెలియగానే వారు కుప్పకూలిపోయారని తెలిపింది.

వృద్ధాప్యంలో వారిని బాధ పెట్టినందుకు తను ఎంతో మనస్థాపానికి  గురైనట్లు చెప్పింది. డ్రగ్స్ కేసుకి సంబంధించి తను క్లీన్ చిట్ తో బయటకి వస్తానని నమ్మకంతో చెబుతోంది. ఇక పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. పెళ్లి, పిల్లలపై తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పింది.