కరోనా మహమ్మారి  సామాన్య ప్రజల దగ్గరనుంచి సీ ఎం వరకు అందరిలో వణుకు పుట్టిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అటు ఏ పి ఇటు తెలంగాణా ప్రభుత్వాలు కంగారు పడుతున్నాయి. కరోనా వైరస్ ని అరికట్టేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రాత్రింబవళ్లు కష్టిస్తున్నాయి.అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలై.. కాలేజీలకు సెలవులను ప్రకటించారు. అలాగే జన సమూహాలు ఉండే చోట్లను బ్లాక్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఫంక్షన్ హాల్స్.. స్కూల్స్.. కాలేజీలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతే కాదు వీటితో పాటు సినిమా థియేటర్లను మూసివేయాలన్న నిర్ణయంచింది. ఈ పరిణామం కోట్లతో నడిచే సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద అని చెప్పాలి. ఎన్నో సినిమాలు విడుదలకి నోచుకోవడం లేదు. 

కోట్లతో జరగాల్సిన వ్యాపారం కుదేలయింది.అప్పటికే హిట్ టాక్ తెచ్చుకొని 10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో భారీగా లాభాలని తెచ్చి పెడుతుందనుకున్న భీష్మ సినిమా కి కరోనా ఎఫెక్ట్ గట్టిగా పడింది. కరోనా వ్యాపిస్తుందన్న భయంతో జనాలు థియోటర్స్ కి వెళ్ళకుండా అగిపోయారు. దాంతో మేకర్స్ కి గట్టి దెబ్బ పడింది. ఈ ఒక్క సినిమానే కాదు త్వరలో రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలకి బ్రేక్ పడింది. ఈ క్రమంలో లౌక్ డౌన్ విధించారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా అన్ని రకాల సడలింపులు ఇస్తున్నారు. దాంతో సినిమా థియోటర్స్ సైతం రీ ఓపెన్ చేస్తారని వినిపిస్తోంది. 

మే 21న చిరంజీవి ఇంట్లో త‌ల‌సానితో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సినిమా షూటింగ్స్‌తో పాటు థియేట‌ర్స్ రీ ఓపెన్ గురించి కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే.  సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఈ విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తాన‌ని త‌ల‌సాని స్ప‌ష్టం  చేశారు. ఈ నేపథ్యంలో సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతులపై పరిశీలిస్తున్నామని, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవచ్చంటూ తెలిపారు. ఇదే క్రమంలో ఆగ‌స్ట్‌లో ఇటు తెలంగాణ అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో థియేట‌ర్స్ ఓపెన్ అవుతాయ‌నే తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్‌లో ప్ర‌తి రోజు మూడు షోస్ ఉండేలా నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తుంది.  ఈ వార్త‌పై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. 

దాంతో నిర్మాతలు ఆగస్టు నుంచి సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పటికే రెడీగా ఉన్న నాని వి సినిమా, రాం రెడ్, మాస్ మహారాజా రవితేజ క్రాక్, అనుష్క నటించిన నిశబ్ధం సినిమాలు ముందు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి వకీల్ సాబ్ లాంటి భారీ సినిమాలు సిద్దం కానున్నాయట. అయితే థియోటర్స్ లో కరోనా నిబంధనలు తప్పనిసరి అంటున్నారు.