తన దైన శైలిలో సినిమాలు చేస్తూ ..అడవి శేష్..ఇండస్ట్రీలో, ప్రేక్షకులలో  తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా కథకుడిగా, స్రీన్ ప్లే రైటర్‌గా అసమాన ప్రతిభ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అందుకు ఆయన నటించిన కథ, కథనాలు అందించిన ‘క్షణం’, ‘గూఢచారి’  చిత్రాల సక్సెస్ లే సాక్ష్యం. ఈ యంగ్ హీరో లీడ్ రోల్‌లో నటించిన మూవీ  ‘ఎవరు’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా క్రితం సంవత్సరం ఆగస్టు 15న విడుదలై మంచి హిట్ ని అందుకుంది ఈ చిత్రం.

అడివి శేషు,రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఎవరు చిత్రం బాక్సాఫీస్ వద్ద పోటీ లేని విధంగా భాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. స్థిరమైన వసూళ్లు కలెక్ట్ చేసింది. ఓ రీమేక్ గా , అతి చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలు ఊహించని స్థాయి కలెక్షన్లు రాబట్టింది. మొదటి రెండు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.75 కోట్ల షేర్‌తో డిస్ట్రిబ్యూటర్స్‌కి హ్యాపీ ఫీస్ట్ ఇవ్వగా... మూడోరోజు ఆక్యుపెన్సీ సాధించి లాభాల బాట పట్టింది. అక్కడ నుంచి వరసపెట్టి వచ్చినదంతా లాభామే.   ముఖ్యంగా ఏ సెంటర్స్ మరియు మల్టీ ప్లెక్స్ లలో ఎవరు స్ట్రాంగ్ గా నడిపించింది. దాంతో ఈ చిత్రం రీమేక్ రైట్స్ అన్ని భాషలుకు అమ్ముడైపోయాయి. తాజాగా ఈ చిత్రం కన్నడ వెర్షన్ రెడీ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కన్నడంలో ఈ సినిమా ని హీరో దిగంత్ చేయనున్నారు. ఈ సినిమాతో ఓ పెద్ద ప్రొడక్షన్ కంపెనీ కన్నడంలోకి రాబోతోంది. తెలుగుకు చేసిన టెక్నికల్ టీమ్ కన్నడంలోనూ అదే చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. లాక్ డౌన్ పూర్తయ్యాక ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది. వినాయిక్ కోడర్సా అనే  దర్శకుడు ఈ సినిమాని డైరక్ట్ చేయనున్నారు.
  
పివిపి పతాకంపై పరం వి పొట్లూరి, పెర్ల్ వి పొట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకట్ రాంజీ తెరకెక్కించగా, శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. అడివి శేషు తో పాటు, రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర, మురళి శర్మ ముఖ్య పాత్రలలో నటించడం జరిగింది.