Asianet News TeluguAsianet News Telugu

'భీమ్లా నాయక్' పాటపై పోలీసుల అభ్యంతరం,డీసీపి ట్వీట్


‘సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే ఈ జానపద గీతం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ‘భీమ్లానాయక్’ టైటిల్‌ సాంగ్‌గా విడుదలైన ఈ పాట ఎంతగానో అలరిస్తోంది. కాగా ఈ టైటిల్ సాంగ్ పై వివాదం నెలకొంది. 
 

Telangana police object some words in Bheemla nayak title song
Author
Hyderabad, First Published Sep 3, 2021, 8:16 AM IST

పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ పాటపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాటలోని కొన్ని పదాలు తెలంగాణ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని ఈస్ట్‌ జోన్‌ జాయింట్‌ సీపీ రమేష్‌రెడ్డి ట్వీట్ చేశారు.

 ‘‘తెలంగాణ పోలీసులు పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసులు. తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొట్టం. పోలీసుల గురించి వివరించేందుకు  రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయి.’’ అంటూ రమేష్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు రిప్లైలు ఇస్తున్నారు.

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌- రానా క్రేజీ కాంబోలో త్రివిక్రమ్ రచనా సారథ్యంలో.. సాగర్‌ చంద్ర డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ నిర్మిస్తుంది. అయితే  పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు పవన్. 

‘సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే ఈ జానపద గీతం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ‘భీమ్లానాయక్’ టైటిల్‌ సాంగ్‌గా విడుదలైన ఈ పాట ఎంతగానో అలరిస్తోంది. కాగా ఈ టైటిల్ సాంగ్ పై వివాదం నెలకొంది. 

మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాతృకలో బీజుమేనన్‌ పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పాత్రను రానా పోషిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌, నిత్యామేనన్‌ హీరోయిన్స్. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios