Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్‌లు షురూ.. థియేటర్లకు ఇంకా టైముంది!

కేసీఆర్‌ను కలిసిన వారిలో మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, అల్లు అరవింద్‌, దిల్‌ రాజుతో పాటు మరికొంత మంది సినీ పెద్దలు ఉన్నారు. వీరితో సుధీర్ఘంగా చర్చించిన సీఎం.. జూన్‌లో షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చిన చెప్పారు.

Telangana government to grant permission to resume Cinema Shootings
Author
Hyderabad, First Published May 22, 2020, 5:49 PM IST

తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి తీపి కబురు చెప్పింది. నిన్న మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రితో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ రోజు ఇండస్ట్రీ పెద్దలంతా సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, అల్లు అరవింద్‌, దిల్‌ రాజుతో పాటు మరికొంత మంది సినీ పెద్దలు ఉన్నారు. వీరితో సుధీర్ఘంగా చర్చించిన సీఎం.. జూన్‌లో షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చిన సూచన ప్రాయంగా చెప్పారు.

అందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. షూటింగ్ లోకేషన్స్‌లో లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించాలని, లోకేషన్‌ను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాలని కేసీఆర్‌ సూచించారు. వీలైనంత తక్కువమందితో షూటింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దశల వారిగా ప్రీ ప్రొడక్షన్‌, ప్రొడక్షన్‌లకు అనుమతులు ఇస్తామని తెలిపారు. ముందుగా షూటింగ్‌లు మొదలై పరిస్థితులు గాడిలో పడిన తరువాత థియేటర్ల ఓపెనింగ్‌ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కేసీఆర్‌ నిర్ణయంతో షూటింగ్‌లు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. భారీ చిత్రాల నిర్మాతలు సరికొత్త స్ట్రాటజీలతో షూటింగ్‌లు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  ఈ లోగా షూటింగ్ ఎలా నిర్వహిస్తారో ప్రభుత్వానికి ఓ డెమో షూట్‌ చేసి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఆగస్టులో థియేటర్లు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios