సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో పాపులర్ అయిన తేజస్వీ మదివాడ.. బిగ్ బాస్‌ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. అంతకు ముందు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్‌ క్రీమ్‌ సినిమాలో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసినా తేజస్వికి రాని గుర్తింపు బిగ్ బాస్‌ కారణంగా వచ్చింది. అయితే బిగ్‌ బాస్‌తో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవటంతో తేజస్వీ ఫెయిల్‌ అయ్యింది. ఆ షో తరువాత కూడా తేజస్వికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కేవలం సోషల్ మీడియాలో అందాల ఆరబోతకే పరిమితమైంది ఈ భామ.

అదే సమయంలో వెబ్ సిరీస్‌లో అవకాశం రావటంతో ఏ మాత్రం హద్దులు పెట్టుకోకుండా అందాలు ఆరబోసింది. లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన తేజస్వీ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చిటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్బంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన పెళ్లి  గురించి స్పందించింది. బాయ్‌ ఫ్రెండ్ ఉన్నాడా అంటే లేడని చెప్పిన తేజస్వి పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం ఆసక్తికర సమాధానం ఇచ్చింది. కరోనా కు వ్యాక్సిన్ వచ్చిన తరువాతే తాను పెళ్లి  చేసుకుంటానని చెప్పింది.

అయితే మరో అభిమాని నీ వయసెంతా అంటే మాత్రం అందుకు సమాధానం చెప్పలేదు తేజస్వీ. అదే సమయంలో తాను నటించిన సినిమాల్లో తన ఫేవరెట్‌ సినిమా `మన ముగ్గరి లవ్‌ స్టోరి` అని చెప్పింది. పానీ పూరి, తాటి ముంజలు, చెరుకుగడలు, పచ్చి మామిడి కాయలు, కాకరాకాయలు అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇప్పటికే కమిట్మెంట్ అనే సినిమాను పూర్తి చేసింది తేజస్వి. ఈ సినిమా లాక్‌ డౌన్‌ పూర్తయిన తరువాత రిలీజ్‌ కానుంది.