తన కెరీర్ లో ఎంతో మంది నటీనటులకు లైఫ్ ఇచ్చిన తెలుగు దర్శకుడు తేజ.తొలి చిత్రం చిత్రం తో మొదలెట్టి తన ప్రతీ సినిమాలోనూ కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి పనే చేయబోతున్నట్లు సమాచారం. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆయన తను డైరక్ట్ చేయబోయే వెబ్ సీరిస్ కు నటీ,నటుల ఎంపిక చేస్తున్నారని వినికిడి. అయితే ఇందుకోసం ఆయన పెద్ద ఆర్టిస్ట్ లను ఎప్రోచ్ కావటం లేదట. టాలెంట్ ఉండి,పాపులారిటీ లేక మిగిలిపోయిన ఆర్టిస్ట్ లను ఏరి , ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు  వీడియో కాల్స్ తో వాళ్లను ఆడిషన్ చేస్తున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం. 

ఈ వెబ్ సీరిస్ చాలా బోల్డ్ గా ఉంటూ డ్రామాతో నడవబోతున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యేలా వీటిని డిజైన్ చేస్తున్నారట. లాక్ డౌన్ ఎత్తేయగానే మొదట వెబ్ సీరిస్ షూటింగ్ మొదలు కానుందని చెప్తున్నారు. తేజ..  అమేజాన్ ప్రైమ్ తో మూడు వెబ్ సీరిస్ లకు సైన్ చేసినట్లు సమాచారం. 

 సురేష్ బాబు, అల్లు అరవింద్ వంటి పెద్ద నిర్మాతలు సైతం...భ‌విష్య‌త్తులో ఓటీటీ సంస్థ‌ల‌దే రాజ్యం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాక స్టార్ డైరక్టర్స్ సైతం ఓటీటీ కోసం ప‌నిచేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇవన్నీ అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. అంతేకాకుండా తేజతో ఓ సినిమాకూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే టాక్స్ జరిగాయని చెప్తున్నారు. చాలా లిమెటెడ్ బడ్జెట్ లో ఈ వెబ్ సీరిస్ లు, సినిమా పూర్తి చేసి ఇస్తానని తేజ హామీ ఇవ్వటంతో ఈ ప్రాజెక్టు ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. ఈ మేరకు ఓ అఫీషియల్ ప్రకటన త్వరలోనే రాబోతోందని వినికిడి. 
 
దాంతో ఈ లాక్ డౌన్ పీరియడ్ లో తేజ పూర్తిగా స్క్రిప్టు పనిమీదే దృష్టి పెట్టారట. వెబ్ సీరిస్ ల స్క్రిప్టు లు పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.  పనిలో పనిగా గోపీచంద్ కోసం ఓ క‌థ‌, రానా కోసం మ‌రో క‌థ రెడీ చేస్తున్నారట. అయితే సినిమా ముందు ప్రారంభం అనుకున్నప్పటికీ అది జరిగే పనిలా లేదు. దాంతో వెబ్ సీరిస్ నే ముందుకు పెట్టినట్లు తెలుస్తోంది.