సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మరణించిన నెలన్నర గడుస్తున్నా ఇప్పటికీ ఆయన మరణం సృష్టించిన ప్రకంనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సుశాంత్ మరణం తరువాత కంగనా రనౌత్‌ విమర్శల దాడి పెంచింది. బాలీవుడ్ పెద్దలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తోంది కంగనా. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కొడుకునే టార్గెట్ చేసింది ఈ బ్యూటీ. సీఎం తనయుడ్ని బేబీ పెంగ్విన్‌ అంటూ సెటైర్స్‌ వేసింది.

`ఒక వేళ నేను నా ఇంట్లో ఉరివేసుకొని చనిపోయినట్టుగా కనిపిస్తే నేను ఆత్మహత్య చేసుకున్నానని మాత్రం భావించకండి. ప్రతీ ఒక్కరి తెలుసు కానీ ఎవరు అతని పేరు చెప్పరు. కరణ్ జోహార్‌ బెస్ట్ ఫ్రెండ్‌, ప్రపంచంలోనే గొప్ప సీఎంకు గొప్ప కొడుకు, అందుకు ప్రేమగా పిలిచే బేబీ పెంగ్విన్‌` అంటూ కంగనా రనౌత్‌ టీం ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు ముందుకు అతని ఇంట్లో పార్టీ జరిగినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కంగనా ట్వీట్ వివాదాస్పదమవుతోంది.

కంగనా ట్వీట్ల నేపథ్యంలో సుశాంత్ అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. ఈ కేసుతో బాలీవుడ్ పెద్దలకు సంబంధాలు ఉన్నట్టుగా ఆరోపణలు వస్తుండటంతో కేసు సీబీఐకి అప్పగించాలన్న వాదన వినిపిస్తోంది. కానీ అందుకు మహారాష్ట్ర సర్కార్‌ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో కంగనా చేసిన కామెంట్స్ ప్రధాన్యం సంతరించుకున్నాయి.