Asianet News TeluguAsianet News Telugu

రజినీకాంత్ కు ఊహించని షాకిచ్చిన తమిళ సీనియర్ దర్శకుడు

  • తమిళనాట ముదురుతున్న రజినీకాంత్ స్థానికత అంశం
  • రాజకీయాలు అంత సులువు కాదని రజినీ,కమల్ లకు జయప్రద హెచ్చరిక
  • మరోవైపు రజినీ స్థానికుడు కాదంటూ దర్శకుడు భారతీరాజా విమర్శలు
  • అన్న ఎన్టీఆర్ లానే తానూ వచ్చి సీఎం అవుతానని నమ్మకంతో వున్న రజినీ
tamilnadu politics are not so easy says jayaprada warns rajini

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేసినప్పటినుంచి తనపై సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమితాబ్ బచ్చన్ లాంటి బాలీవుడ్ బిగ్ బీ సైతం రజినీకాంత్ పార్టీ ప్రకటిస్తే చాలా సంతోషం అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అయితే... రజినీ కాంత్ రాజకీయాల్లోకి రావటంపట్ల పలువురు కోలీవుడ్ ప్రముఖులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తమిళనాట రజినీకాంత్ రాజకీయాలు ఏంటని, అసలు రజినీ స్థానికుడే కాదని దర్శకుడు భారతీరాజా బాంబ్ పేల్చారు. ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తుతాయని తెలిసినా రజినీ మాత్రం చాలా నమ్మకంగా రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధ పడుతున్నారు. ఇప్పటికే పార్టీ ప్రకటన త్వరలోనే వుంటుందని రజినీ స్పష్టం చేశారు.

 

ఇక తమిళనాట విలక్షణ నటుడుగా పేరుగాంచిన కమల్ హాసన్ కూడా తన రాజకీయ పార్టి ఫిబ్రవరి 21న ప్రకటించబోతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, మాజీ ఎంపీ, రాజకీయ నేత జయప్రద వీళ్ల రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించారు. రజనీ, కమల్‌లు రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే వారు వెళ్లే దారి పూలదారి మాత్రం కాదని, ఎన్నో ముళ్లు, రాళ్లు ఉంటాయని చెప్పారు. వాటిని చూసి అడుగు వేయాలన్నారు. రాజకీయాలంటే కేవలం రెండున్నర గంటల సినిమా మాత్రం కాదన్నారు. సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. జయలలిత మృతి తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందన్న జయప్రద...  రజనీ, కమల్ హాసన్‌లు రాణిస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.

 

మరోవైపు రజినీకాంత్ మాత్రం తాను సీఎం అవుతాననే నమ్మకంతో వున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 8 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29 మార్చి 1982న తెలుగుదేశం పార్టీ స్థాపించి 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అలాంటి చరిత్రనే సృష్టిస్తానంటున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. తమిళనాడులో ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చినా పోటీ చేయడానికి సిద్ధమేనంటున్నారు. కమల‌్ హాసన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఎన్నికల వ్యూహం ఎలా వుంటుందో చెప్పబోననీ అన్నారు. రాజకీయాల్లో కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios