స్టార్ హీరోలు ఒకరి సినిమా కోసం మరొకరు సహాయం చేసుకోవడం సహజం. అది ఏరకంగా అయినా సరే ప్రమోషన్ మాత్రం చేస్తుంటారు. ఇక రీసెంట్ గా రామ్ కోసం తమిళ స్టార్ హీరో శింబు రంగంలోకి దిగాడు.
స్టార్ హీరోలు ఒకరి సినిమా కోసం మరొకరు సహాయం చేసుకోవడం సహజం. అది ఏరకంగా అయినా సరే ప్రమోషన్ మాత్రం చేస్తుంటారు. ఇక రీసెంట్ గా రామ్ కోసం తమిళ స్టార్ హీరో శింబు రంగంలోకి దిగాడు.
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని తమిళ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ది వారియర్ టైటిల్‌తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో టాలీవుడ్ యంగ్ స్టార్హీరో రామ్ పోతినేని కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈసినిమా కోసం రామ్ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రెడ్ సినిమా ప్లాప్ అవ్వడంతో రామ్ కూడా ఈసినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
ఇక ఈ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరో శింబు రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. పాపులర్ హీరో శింబు ది వారియర్ సినిమాలో ఓ పాట పాడుతున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం బుల్లెట్ సాంగ్‌ను కంపోజ్ చేయగా..శింబు ఈ పాటను ఆలపించాడు.డైరెక్టర్ లింగుస్వామి, శింబు, రామ్, డీఎస్పీ కలిసి దిగిన ఫొటోతో పాటు ఈ అప్ డేట్ కూడా సోషల్ మీడయాలో చక్కర్లు కొడుతుంది.
యాక్షన్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్ లింగుస్వామి. ఈ సినిమాలో రామ్ ను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రీజ్ అయిన లుక్స్ లో రామ్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలో ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ భామ అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తోంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళ ఆడియన్స్ కు సుపరిచితుడైన ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నాడు.
