వ్యభిచారం కూపం నడుపుతున్న ఒకప్పటి హీరోయిన్ వ్యవహారం వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో 90లలో హీరోయిన్ గా నటించిన సంగీత బాలన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. పలు టీవీ సీరియళ్లలో కూడా ఆమె నటిస్తూ పాపులారిటీ సంపాదించింది. అటువంటిది ఇప్పుడు ఆమె వ్యభిచారం నిర్వహిస్తూ దొరకడంతో కోలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది.

చెన్నైలో పనయూర్ అనే ప్రాంతంలో ఓ ప్రైవేట్ రిసార్ట్ లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వ్యభిచారాన్ని నిర్వహిస్తోన్న సంగీత బాలన్ ను ఆమెకు సహకరిస్తోన్నసురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వ్యభిచారస్తులుగా దొరికిన అమ్మాయిలంతా కూడా నార్త్ ఇండియాకు చెందిన వారు.. వారిని అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు. కొందరు విటులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కోర్టు సంగీత బాలన్, సురేష్ లకు 
కస్టడీ విధించింది.