కోలీవుడ్ స్టార్ హీరో సూర్యపై చర్యలు తీసుకోవాలంటూ మద్రాస్‌ హైకోర్ట్‌ జడ్జ్‌ ఎస్‌ఎమ్‌ సుబ్రమణియం చీఫ్‌ జస్టిస్‌ అమ్రేశ్వర్‌ ప్రతాప్ సాహికి లేఖ రాశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రస్ట్‌ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ సూర్య ఓ లేఖను విడుదల చేశాడు. దీంతో సూర్య వ్యాఖ్యలు కోర్టు దిక్కరణ కిందకు వస్తాయని, ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ జడ్జ్‌ సూచించారు.

తమిళనాడులో ముగ్గురు విద్యార్దులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో సూర్య తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఓ లేఖను రిలీజ్ చేశాడు. `కోవిడ్ భయంతో జడ్జ్‌లు మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పులు వెల్లడిస్తూ, విద్యార్ధులను మాత్రం భయం లేకుండీ నీట్ పరీక్ష రాయమంటున్నారు` అంటూ కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో జస్టిస్ సుబ్రమణ్యం సూర్య వాఖ్యలు కంటెంప్ట్‌ ఆఫ్ కోర్టు కిందకు వస్తాయని, ఆయన కోర్టులను, జస్టిస్‌లను అవమానించేలా మాట్లాడారని అన్నారు.

శనివారం నీట ఎగ్జామ్ భయంతో ముగ్గురు విద్యార్దులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో సూర్య రిలీజ్ చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో ఎగ్జామ్ పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం పేద ప్రజల కలలను చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు సూర్య. తమిళనాడులోని అన్ని రాజకీయా పార్టీలు నీట్ విషయంలో కేంద్రానికి వ్యకతిరేఖంగానే ఉన్నాయి.