తమన్నా తొలినుంచీ తన సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. టాలెంట్ కు తగిన తెలివి ఉండటం ఆమెకు ప్లస్ అయ్యింది. ఇంతకాలమైనా ఫేడ్ అవుట్ అవకుండా బిజీగా ఉంటోంది. ఇన్నాళ్లూ పాత్రలు , పెద్ద బ్యానర్స్ అని ఆలోచించిన ఆమె స్ట్రాటజీని మార్చింది. రెమ్యునేషన్ గట్టిగా ఉంటే సై అంటోంది. తాజాగా నితిన్ చిత్రం ఓకే చేసినప్పుడు ..తమన్నా అలాంటి పాత్రలోనా అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆమె ఆ సినిమా కమిటవ్వటం వెనక ..ఏకైక కారణం ఆమెకు చెల్లించే రెమ్యునేషన్ అని తెలుస్తోంది.  అందుతున్న సమాచారం మేరకు ఈ పాత్ర చేయటానికి మొదట అసలు ఒప్పుకోలేదట. 

ఈ సినిమా చేస్తే తనకు ఆంటి ఇమేజ్ వచ్చేస్తుందని,తనను నెగిటివ్ రోల్స్ కు అడగటం మొదలెడతారని తిరస్కరించింది. అయితే ఇది ఇలా తేలే పని కాదని నితిన్ ...డైరక్టర్ గా సీన్ లోకి వచ్చి..ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడట. ఇది నటనకు అవకాసం ఉన్న పాత్ర అని, అవార్డ్ లు తెచ్చుకున్న సినిమా అని, నీకు అంతటి పేరు వస్తుందని చెప్పారట. ఆమె మెత్తబడి ఆలోచిస్తా అందిట. అలా ఆమె కు విభిన్నపాత్రలు చేయాలనే బలహీనతపై నితిన్ పాయింట్ రైజ్ చేసి ఓకే చేసాడంటున్నారు. 

ఇది జరిగిన వెంటనే ఈ   క్రేజీ ప్రాజెక్టుకి కోటిన్నర ఇస్తానని ఆమె మేనేజర్ కు కబురు పంపారట. అంతే పని అయ్యిపోయింది. ఆమె సైన్ చేయటానికి ఒప్పుకుందని తెలుస్తోంది. అయితే ఆమె పాత్రే సినిమాని నిలబెడుతుందని అర్దం చేసుకున్న నితిన్ తండ్రి,నిర్మాత  సుధాకర్ రెడ్డి సైతం  ..వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. ఇది ఇండస్ట్రీలో ప్రచారం అవుతున్న విషయం.  

ఇక బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘అంధాధున్‌’ను నితిన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ డైరెక్టర్‌. హీరోయిన్ గా ఇస్మార్ట్‌భామ నభా నటేశ్ కనిపించనుంది. ఈ సినిమాలో హీరోతో సమాన ప్రాధాన్యత గల ఓ పవర్‌ఫుల్‌ లేడీ పాత్ర ఉంటుంది. హిందీలో ఆ పాత్రలో టబు కనిపించి మెప్పించారు. పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. అయితే, రీమేక్‌లో ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్న దానిపై పలు వార్తలు వినిపించాయి. 

పవర్‌ఫుల్‌ లేడీ పాత్రకు సరిపోయే వారికోసం చిత్ర యూనిట్ బాగానే అన్వేషించింది. మొదట్లో.. తెలుగులో కూడా టబునే నటిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రమ్యకృష్ణ.. అనసూయ.. ఇలియానా చాలా పేర్లు వినిపించాయి. ఆఖర్లో శ్రియ శరణ్‌ ఓకే చెప్పేసిందని, షూటింగ్ ఆలస్యమని కూడా అన్నారు. అయితే, చిత్ర యూనిట్  వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

మిల్కీబ్యూటీ తమన్నా తమ రీమేక్‌కు ఓకే చెప్పిందని ప్రకటించింది. టబు పాత్రలో తమన్నా, రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్‌ కనిపించనున్నారని చెప్పింది. నవంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. టుబు పాత్రను తమన్నా ఛాలెంజింగ్‌గా తీసుకుందని చిత్రబృందం పేర్కొంది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం సమకూర్చనున్నారు.