మిల్కీ బ్యూటీ తమన్నాకు యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిన సంగతే. తమన్నా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. అందాలు వెదజల్లడంలో మిగిలిన హీరోయిన్లకంటే తమన్నా ఓ అడుగు ముందే ఉంటుంది. గ్లామర్ విషయంలో తమన్నా హద్దులు పెట్టుకోదు. 

మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ ఉండడంతో తమన్నా కార్పొరేట్ ఎండార్స్మెంట్ విషయంలో కూడా దూసుకుపోతోంది. తమన్నా ఇప్పటివరకు పలు కార్పొరేట్ ఉత్పత్తులకు ప్రచారం కల్పించిన సంగతి తెలిసిందే. ఇటీవల తమన్నా ఓ షూ బ్రాండ్ యాడ్ షూట్ పాల్గొంది. 

ఈ యాడ్ కోసం కూడా తమన్నా తన గ్లామర్ ఉపయోగించుకుంది. సెక్సీ ఫోజులు, నడుము అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సినిమాల విషయానికి వస్తే తమన్నా ఈ ఏడాది ఎఫ్2 రూపంలో భారీ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సైరా, తమిళంలో కొన్ని  చిత్రాలు తమన్నా చేతిలో ఉన్నాయి.