ఇటీవల ప్రపంచాన్ని రెండు దారుణ సంఘటనలు కుదిపేస్తున్నాయి. అమెరికాలో నల్ల జాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ను ఓ తెల్ల  జాతీ పోలీస్‌ దారుణంగా గొంతు నులిమి చపటం, తరువాత కేరళ రాష్ట్రంలో గర్భంతో ఉన్న ఓ ఏనుగుకు కొంత మంది ఆకతాయిలు కారణం కావటం. ఈ రెండు సంఘటనలు ప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సంఘటనల మీద తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

మనుషుల్లో మానవత్వం నశించిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హీరోయిన్‌ తమన్నా కూడా స్పందించింది. ఓ బ్లాక్ అండ్ వైట్‌ ఫోటోను ట్వీట్ చేసిన తమన్నా. ఇలాంటి దారుణమైన సంఘటనల మీద ప్రతీ ఒక్కరు స్పందించాలంటూ తనదైన స్టైల్‌లో స్టేట్‌మెంట్ ఇచ్చింది.

`నీ నిశ్శబ్దం నిన్ను కాపాడదు. ప్రతీ ప్రాణం ముఖ్యమే కదా.. మనిషైనా.. జంతువైనా..? మనం మారాల్సిన సమయమిది. మనిషిగా జీవించటం మళ్లీ నేర్చుకోవాలి. ప్రేమభావన అలవరుచుకోండి` అంటూ కామెంట్ చేసింది. ఈ విషయంలో సోషల్ మీడియా ఫాలోవర్స్‌ కూడా తమన్నాకు మద్దతు తెలుపుతున్నారు.