తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఛాలెజింగ్‌ రోల్స్‌తో పాటు కాంట్రవర్సియల్ స్టేట్‌మెంట్స్‌తోనూ ఎప్పుడు వార్తల్లో ఉండే ఈ బ్యూటీ  మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా తాప్సీ కూడా ఇంటికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ ఓ మీడియా సంస్థకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది తాప్సీ.

గతంలో ఈ భామను లవ్‌ లైఫ్‌ గురించి అడగ్గా ఎప్పుడూ స్పందించలేదు. బాలీవుడ్‌ లో బిజీ అయిన తరువాత తనకు బాయ్‌ ఫ్రెండ్ ఉన్నట్టుగా క్లారిటీ ఇచ్చినా అతనెవరో మాత్రం వెల్లడించలేదు. తాను ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్‌ బోతో ప్రేమలో వెల్లడించింది తాప్సీ. తమ ప్రేమను తల్లిదండ్రులు కూడా అంగీకరించారని వెల్లడించింది తాప్సీ. ఒక వేళ తల్లి దండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోయి ఉంటే తాను బో తో రిలేషన్‌ను వదులుకునే దానినని చెప్పింది.

`బోను నా జీవితంలోకి ఆహ్వానించడాన్ని గర్వంగా భావిస్తున్నాను. గతంలో ఎప్పుడూ నా ప్రేమ గురించి మాట్లాడినా నా బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరు అన్న విషయం మాత్రం చెప్పలేదు. అందుకు కారణం లేకపోలేదు. నేను నటిగా ఓ గుర్తింపు తెచ్చుకున్న తరువాతే తన పార్టనర్‌ పేరును వెళ్లడించాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఇన్నాళ్లు చెప్పలేదు. ఒకవేళ నేను గతంలోనే నా పేరు బాయ్‌ ఫ్రెండ్ పేరు చెప్పుంటే ఇన్ని విజయాలు నాకు దక్కేవి కావు` అంటూ చెప్పింది తాప్సీ.

`నేను రిలేషన్‌లో ఉన్న సంగతి నా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. నా సోదరి, తల్లిదండ్రులు అందరికీ నా ప్రేమను అంగీకరించారు. ఒకవేళ వాళ్లు అంగీకరించకపోతే నేను నా ప్రేమను అంగీకరించలేను` అని చెప్పింది. తాప్సీ ఇటీవల అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన థప్పడ్ సినిమాలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాతో తాప్సీకి మరోసారి నటిగా మంచి పేరు వచ్చింది.