మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ హంగామా మొదలైంది. పంజాబ్ లాంటి ప్రాంతాలో కూడా టికెట్ల బుకింగ్ ఎలా ఉందో తెలిసిందే. 

తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి సినిమా అంటే మోతెక్కిపోవడం ఖాయం. బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లో కూడా మెగా అభిమానులు సైరా రిలీజ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అమెరికా లాంటి విదేశాల్లో తెలుగు ఎన్నారైలు సైరా ప్రీమియర్ షోలకు రచ్చ రచ్చ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. 

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సైరా రిలీజ్ హంగామాతో దద్దరిల్లబోతోంది. తెలుగు ఎన్నారైలు ఆ విధంగా ప్రీమియర్స్ షోల సమయంలో కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. వాషింగ్టన్ లోని లింకన్ స్క్వేర్ వద్ద అక్టోబర్ 1న ఎన్నారైలు ఫ్లాష్ మాబ్, కేక్ కటింగ్ లతో సైరా ప్రీమియర్స్ సంబరాలు చేయనున్నారు. 

అక్టోబర్ 1న సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు సైరా ప్రీమియర్స్ హంగామా కొనసాగనుంది. ఈ సందర్భంగా అమెరికాలోని చిరంజీవి, పవన్ అభిమానులు ఉమ్మడిగా ఓ ప్రకటన, వీడియో రూపంలో మరో ప్రకటన విడుదల చేశారు. 

"