మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్.. ‘సైరా నరసింహా రెడ్డి’ కలెక్షన్స్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచీ  రికార్డులు సృష్టిస్తోంది. ‘పాన్ ఇండియా’గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌డే.. ఫస్ట్ షోతోనే మంచి టాక్‌ అందుకోవటం కలిసొచ్చింది. చాలా రోజుల తరువాత మళ్లీ చిరంజీవి తన స్టామినా ఏంటో గుర్తుచేశారంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

62 ఏళ్ల వయసులో కూడా.. యంగ్ అండ్ డైనమిక్‌గా నటించి శభాష్ అనిపించారు చిరు. ప్రేక్షకుడికి గూజ్‌బంప్స్ తెప్పించారు. అయితే ఇదంతా ఓ వైపు...మరో వైపు ప్రమోషన్స్ విషయంలో చాలా పూర్ గా ఉన్నారని డిస్ట్రిబ్యూటర్స్ టెన్షన్ పడుతున్నారు. మరీ ముఖ్యంగా నార్త్ లో అసలు ఈ సినిమా ప్రమోషన్ పెద్దగా కనిపించటం లేదు.

మామూలుగా మనకు ఇక్కడ చిరంజీవి తెలుసుకాబట్టి ట్రైలర్స్, పోస్టర్స్, సోషల్ మీడియా ప్రచారం, ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్  సరిపోతుంది. అయితే హిందీ మార్కెట్ కు వచ్చేసరికి అలాంటివి అక్కడ ఆనవు. చిరంజీవి వాళ్లకు ఎంతవరకూ తెలుసో, గుర్తు ఉన్నాడో తెలియదు. అలాంటప్పుడు సినిమా కు ఓ రేంజిలో ప్రమోషన్ చేయాలి. సాహోకు ప్రభాస్ అలా కష్టపడ్డాడు. పది రోజుల్లో ఇరవై ఐదు సిటీల దాకా కవర్ చేసి ప్రభాస్ తన సినిమాకు ఓపినింగ్స్ రప్పించుకున్నాడు.

ఆ విధంగా సైరాని బాలీవుడ్ లో ప్రమోట్ చేయలేకపోయారన్నది నిజం.  నామమాత్రంగా నాలుగు టీవి ఛానెల్స్ లో ఇంటర్వూలు ఇచ్చారు అంతే. టీవి షోలలోనూ చిరంజీవి కనపడలేదు. అలాగే అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనూ లేదు. అందుకేనేమో తొలిరోజు బాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద కేవలం  రెండున్న కోట్ల దాకానే నెట్ కలెక్ట్ చేసింది.
   
ఇది చరణ్, చిరు నిర్లక్ష్యం చేసిన పొరపాటు అంటున్నారు. 280 కోట్ల బడ్జెట్, చిరంజీవి అద్బుత నటన బాలీవుడ్ లో నిలబడలేకపోవటానికి కారణం పబ్లిసిటీ లేకపోవటమే అని తేల్చారు. బాలీవుడ్ లో సినిమా చేసేటప్పుడు అక్కడ ప్రమోషన్ మోడల్ ఫాలో కావాలి. ఆ విషయంలో బాహుబలి, సాహో చిత్రాలు ముందు ఉన్నాయి.