మొత్తానికి అందరూ ఊహించినట్లే సైరా ఎఫెక్ట్ ...నిన్న రిలీజైన చాణక్య పై పడింది. హిట్ కోసం ఎడారిలో ఒయాసిస్సులా ఎదురుచూస్తున్న గోపిచంద్ కు ఇది ఊహించని దెబ్బే. ఎంతమంది చెప్పినా వినకుండా చిరంజీవి యొక్క ‘సైరా’ చిత్రం వసూళ్ల ప్రభంజనం లో ఇరుక్కుపోయాడు. నా సినిమాలో సత్తా ఉంది చూస్తారు అన్న నిర్మాతలు, గోపీచంద్ థీమానే డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన పెట్టుబడి భీమా లేకుండా చేసింది.  

మొదటి నుండి అనుకున్నట్టే ‘సైరా’ ప్రభావం ఈ చిత్రం మీద చాలా వరకు పడటంతో ట్రేడ్ మాత్రం పెద్దగా ఆశ్చర్యపోలేదు. అసలే గోపీచంద్ సినిమాలకు ఈ మధ్యన ఓపినింగ్స్ రావటం లేదు. దీనికి తోడు ఈ ఎఫెక్ట్ తో .. గోపిచంద్ గత చిత్రాల కంటే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నిన్న వీకెండ్ కావడంతో సాధారణంగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా పెద్ద చిత్రమైన ‘సైరా’ వైపే అడుగులు వేయటం గమనార్హం. శుక్రవారంతో పోలిస్తే శనివారం పెరిగిన ‘సైరా’ వసూళ్లే ఇందుకు సాక్ష్యంగాచూపెడుతున్నారు.

ఇక ‘చాణక్య’కి నైజాంతో పాటు అన్ని ఏరియాల్లో ప్రారంభమే పూర్ గా  కనబడింది. దానికి తోడు రివ్యూలు,  వర్డ్ ఆఫ్ మౌత్ కూడా  సినిమాకు నెగిటివ్ గా ఉండటం చిత్రానికి మరొక డ్రాబ్యాక్.  ఈ రోజు ఆదివారం కావడంతో పాటు, దసరా పండుగ కూడా రెండు రోజులలో రానుండటంతో చాణక్య వసూళ్లు మెరుగయ్యే అవకాశం ఉందని టీమ్ ఆశగా ఎదురుచూస్తోంది.

ఇక గోపీచంద్ మొదటిసారి అండర్ కవర్ రా ఏజెంట్ చేసిన చాణక్య చిత్రంలో హీరోయిన్ గా మెహ్రిన్ నటించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పంతం చిత్రం రావడం జరిగింది. జరీన్ ఖాన్ మరో హీరోయిన్ గా నటించగా సునీల్, అలీ, నాజర్, ఆదర్శ్, రాజా చెంబూరు ఇతర పాత్రలో కనిపించారు.