టాలీవుడ్ లో రాజమౌళి తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో ఒక హిస్టారికల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి. సైరా సినిమాని భారీ స్థాయిలో వెండితెరపైకి తీసుకువచ్చి మంచి ప్రశంసలు అందుకున్నాడు. సురేందర్ రెడ్డి కి మరో అవకాశం ఇవ్వవచ్చు అనే ఆలోచనలతో చాలా మంది స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. 

ఇక సైరా సినిమా అనంతరం సురేందర్ రెడ్డి ఏ హీరోతో వర్క్ చేస్తారనే అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో సురేందర్ రెడ్డి చేసిన కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా చేస్తాడా..? లేక సైరా కారణంగా ఇమేజ్ పెరిగిందని పెద్ద ప్రాజెక్ట్ చేస్తాడా..? అని అందరిలో సందేహాలు మెదులుతున్నాయి. అయితే సైరా కంటే ముందే సెట్ చేసుకున్న రెండు కథలను పక్కనపెట్టిన దర్శకుడు నెక్స్ట్ కూడా ఫ్యాన్ ఇండియాలో లెవెల్లో మరో సినిమా చేసేందుకు డిసైడ్ అయినట్లు టాక్. 

అది కూడా ప్రభాస్ తో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. రీసెంట్ గా స్టోరీ లైన్ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్నీ పక్కనపెడితే మరోవైపు ప్రభాస్ ఇప్పట్లో పెద్ద సినిమాలను భారీ బడ్జెట్ సినిమాలను టచ్ చేయలేను అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సాహో ప్రమోషన్ లో కూడా తరచు అదే చెబుతూ వచ్చాడు. మరి సురేందర్ రెడ్డి ఏ హీరోతో వర్క్ చేస్తాడో చూడాలి.