మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకుంటున్న చిత్రంగా సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. కొణిదెల ప్రొడక్షన్ మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ నెల 2న రిలీజైన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ్ - మలయాళం - కన్నడ - హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు.

ఇక హిందీ తమిళ్ మలయాళంలో సైరా అనుకున్నంతగా కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. కానీ కన్నడ తెలుగులో మాత్రం సాలిడ్ కలెక్షన్స్ సినిమా బయ్యర్లకు మంచి లాభాలని అందిస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా అదే ఫ్లో కొనసాగుతోంది. మొన్న యూఎస్ లో 2 మిళియన్స్ డాలర్స్ ని అందుకున్న సైరా సెకండ్ వీకెండ్ లో 2.5 మిలియన్ డాలర్స్ తో సరికొత్త రికార్డ్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 యూఎస్ లో టోటల్ గా $2.4 మిలియన్ డాలర్స్ ని అందుకుంది. ఇక ఇప్పుడు సైరా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి టాలీవుడ్ టాప్ తెలుగు యూఎస్ బాక్స్ ఆఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఇండియా కలెక్షన్స్ విషయానికి వస్తే కొన్ని ఏరియాల్లో సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ చేయాల్సి ఉంది.  

టోటల్ గా 135కోట్లకు పైగా కలెక్షన్స్ తో 12వ రోజు స్ట్రాంగ్ గా కనిపించిన సైరా ఇదే తరహాలో మరొక వారం నడిస్తే డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు అందే అవకాశం ఉంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార - తమన్నా హీరోయిన్స్ గా నటించగా అమితాబ్ బచ్చన్ - విజయ్ సేతుపతి - సుదీప్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.