Asianet News TeluguAsianet News Telugu

‘సైరా’ సండే రికార్డ్ లు..రెండు చోట్ల రచ్చ

చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ దేశ వ్యాప్తంగా రిలీజైనా...తెలుగులో మాత్రం   భారీ ఆదరణ పొందుతూ ఘన విజయం సాధించింది. అయితే అందుకు దసరా శెలవులు, పోటీగా ఏ సినిమా కూడా మార్కెట్ లో లేకపోవటం కలిసొచ్చాయని మీడియా మాట్లాడుతోంది. ఈ నేపధ్యంలో ఈ ఆదివారం పరిస్దితి ఎలా ఉందనేది చూద్దాం.

Sye Raa: Two Landmark records on Sunday
Author
Hyderabad, First Published Oct 14, 2019, 8:51 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ దేశ వ్యాప్తంగా రిలీజైనా...తెలుగులో మాత్రం   భారీ ఆదరణ పొందుతూ ఘన విజయం సాధించింది. అయితే అందుకు దసరా శెలవులు, పోటీగా ఏ సినిమా కూడా మార్కెట్ లో లేకపోవటం కలిసొచ్చాయని మీడియా మాట్లాడుతోంది. ఈ నేపధ్యంలో ఈ ఆదివారం పరిస్దితి ఎలా ఉందనేది చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఆదివారం రెండు రికార్డ్ లు కైవసం చేసుకుంది. అందులో ఒకటి నైజాం ఏరియాలో ఈ సినిమా 30 కోట్లకు చేరింది.  బాహుబలి సినిమా తర్వాత ఈ అరుదైన ఫీట్ ని చేసింది సైరా మాత్రమే. అలాగే సైరా హిందీ వెర్షన్ ...విచిత్రంగా నిన్న ఆదివారం పికప్ అయ్యింది. ముంబై, పూనా, రూర్కెలా వంటి సిటీల్లో హౌస్ ఫుల్ బోర్డ్ లు కనిపించాయి.

వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన సైరా చిత్రం.. నార్త్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో ఆడడంలేదు. బాలీవుడ్‌లో ఈమూవీ డిజాస్టర్‌గా ముగిసినట్లే అంచనా వేసారు. 10 రోజుల థియేట్రికల్ రన్‌ని పూర్తి చేసుకున్న సైరా  నార్త్‌లో పికప్ కాలేదు. అయితే నిన్న నార్త్ లో చాలా సిటీల్లో హౌస్ ఫుల్ అవటంతో కాస్త అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సైరాను నార్త్‌లో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈమూవీ అక్కడ కేవలం 10 రోజుల్లో 7 కోట్ల నెట్ మాత్రమే దక్కించుకుంది. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్  నటించినప్పటికీ ఈసినిమా కేవలం 7 కోట్ల నెట్ మాత్రమే వసూళ్లు చేయటం అందిరినీ ఆశ్చర్యపరిచిన అంశం.

Follow Us:
Download App:
  • android
  • ios