భారతదేశ మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ హిస్టారికల్ సినిమాను సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారులు వీక్షించి సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక రీసెంట్ గా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తన కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూశారు. మెగాస్టార్ కూడా స్పెషలా షోను వీక్షించారు. సినిమా చుసిన అనంతరం ఆమె ప్రత్యేకంగా మెగాస్టార్ ని కలుసుకొని అభినందనలు తెలియజేశారు. తెలంగాణ గవర్నర్ కుటుంబం కోసం ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్రబృందం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. గతవారమే మెగాస్టార్ గవర్నర్ ని కలిసి సినిమాను చూడాల్సిందిగా కోరారు.  

చిరంజీవి ఆహ్వానం మేరకు మంగళవారం సినిమాను చూసిన గవర్నర్ చిత్ర యూనిట్ ని అభినందించారు. సినిమా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరు చూడదగిన చిత్రమని అన్నారు. కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఇప్పటికే సినిమా వరల్డ్ వైడ్ గా 100కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.