టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సైరా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. సినిమా లోకల్ గా ఎన్ని కోట్ల వసూళ్లు రాబడుతుందో గాని యూఎస్ లో మాత్రం డాలర్ల వర్షం కురిపించనుందని చెప్పవచ్చు. ప్రీమియర్స్ కి పూర్తి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇక సైరా ఫీవర్ ని ఆధారంగా చేసుకొని కొంతమంది హోటల్స్ లో కూడా సైరా ని స్ట్రాంగ్ గా వాడేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలకు థియేటర్స్ ముస్తాబవడం కామన్. కానీ వెరైటీగా అమెరికాలో కూడా ఆ డే తరహాలో సిద్ధమవుతున్నాయి. థియేటర్స్ ను ఇండియన్ ఫ్లాగ్స్ తో అలాగే కలర్ఫుల్ లైట్స్ తో అలంకరించారు. అమెరికాలో దాదాపు ప్రీమియర్ షోలన్ని హౌస్ ఫుల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా ఉన్నాయి. ఈజీగా $1 మిలియన్ మార్క్ ని ప్రీమియర్స్ ద్వారా అందుకుంటారని తెలుస్తోంది. 

ఇక 2 మిలియన్ వచ్చినా రావచ్చని టాక్ వస్తోంది. ఆ రికార్డులపై క్లారిటీ రావాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇక చెన్నైలో కూడా సైరా జోష్ గట్టిగా కనిపిస్తోంది. గతంలో రిలీజైన తెలుగు సినిమాలకంటే అక్కడ అత్యధిక లొకేషన్స్ లో సైరాను విడుదల చేస్తున్నారు. మలయాళం - కన్నడ భాషల్లో కూడా సైరా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.