ఓ పక్క కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ ను కుదిపేస్తుంటే.. ఇప్పుడు అమెరికాలో టాలీవుడ్ తారల సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చి పెనుదుమారం రేపుతోంది. కిషన్ దంపతుల అరెస్ట్ తో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు స్పందించారు. తమకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనట్లు వెల్లడించారు. తాజాగా నటి శ్వతాబసు ప్రసాద్ కూడా ఈ విషయంపై కామెంట్ చేసింది.

అయితే, ఈ వ్య‌వ‌హారంపై శ్వేతాబ‌సు ప్ర‌సాద్ స్పందించింది. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్వేతాబ‌సు ప్ర‌సాద్ మాట్లాడుతూ.. అమెరికాలో త‌న‌కు గ‌తంలో జ‌రిగిన చేదు అనుభ‌వాన్ని చెప్పుకొచ్చింది. తెలుగు సంఘాల వారు పిలిచిన ఈవెంట్‌కు వెళ్లిన స‌మ‌యంలో.. త‌న‌కు ఫైవ్ స్టార్ హోట‌ల్ బుక్ చేశార‌ని, కార్య‌క్ర‌మం ముగిసిన వెంట‌నే తిరుగు ప్ర‌యాణం స‌మ‌యంలో ఫ్లైట్ మిస్ కావ‌డంతో చేసేదేమీ లేక మ‌ళ్లీ హోట‌ల్‌కే వెళ్లాన‌ని తెలిపింది. ఆ స‌మయంలోనే కొంద‌రు యువ‌తుల‌ను హోట‌ల్ నుంచి అరెస్టు చేసి తీసుకు పోతుండ‌టాన్ని గ‌మ‌నించానని తెలిపారు. అప్ప‌టి వ‌ర‌కు ఆ హోట‌ల్‌లో వ్య‌భిచారం జ‌రుగుతున్న‌ట్టు త‌న‌కు కూడా తెలియ‌ద‌ని, పోలీసులు యువ‌తుల‌ను అరెస్టు చేసి తీసుకుపోతుండ‌టాన్ని చూసి షాక్ అయిన‌ట్టు శ్వేతాబ‌సు ప్ర‌సాద్ చెప్పింది.