ఈ చిత్రం ఇంకా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. అయితే ఇప్పుడు ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే ఓ చిన్న మెలిక పెట్టారు...అమేజాన్ ప్రైమ్ వారు.
మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కించిన యాక్షన్ అండ్ సోషల్ డ్రామా “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నడుమ విడుదలైన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా నిలిచి రికార్డు వసూళ్లతో అదరగొట్టింది. మే 12న రిలీజ్ అయిన సర్కారు వారి పాట.. 12 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. మొదట డివైడ్ టాక్ ఉన్నా సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఎఫ్ 3 రావటంతో దాదాపు ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ మొదలైంది. అప్పటికీ తాజాగా మురారి బావా సాంగ్ కూడా యాడ్ చేశారు. ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట ఓటిటి రిలీజైంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసిన స్ట్రీమింగ్ యాప్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా ఫ్రీ గా చూడ్డానికి కుదరదు. కేవలం రెంట్ విధానంలో పే ఫర్ వ్యూ గా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. దీనితో ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ ప్రక్కన థియోటర్ రన్ ఉండగానే ఓటిటిలో పెట్టేయటం చాలా మంది అభిమానులకు కోపం తెప్పిస్తోంది. అమేజాన్ ప్రైమ్ అయిన మేరకు పిండుకుందామనే ఈ డెసిషన్ తీసుకుంది అంటున్నారు. అయితే ఇంతకు ముందు కేజీఎఫ్ 2 కూడా ఇలాగే పే ఫర్ వ్యూ పెట్టారు.
ఇక స్పైడర్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత.. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక రీసెంట్‌గా వచ్చిన సర్కారు వారి పాట చిత్రంతో వరుసగా నాలుగో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఏదమైనైనా ఈ మధ్య పెద్ద సినిమాలైతే నెల రోజులకు అటు, ఇటుగా ఓటిటిలోకి వస్తుండగా.. చిన్న సినిమాలైతే రెండు, మూడు వారాల్లోనే వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట కూడా అలాగే ఓటిటి ఎంట్రి ఇచ్చి షాక్ ఇచ్చింది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
